ANR Award: అక్టోబర్ 28న ANR అవార్డు వేడుక.. మెగాస్టార్ చిరంజీవికి అవార్డు అందజేయనున్న బిగ్ బి
- సెప్టెంబర్ 20న అత్యంత ఘనంగా అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి
- చిరంజీవికి ప్రతిష్టాత్మక ANR అవార్డు
- ఈ అవార్డు ప్రదానోత్సవానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి గత నెల (సెప్టెంబర్ 20)న అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ANR స్మారక ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది. అక్కినేని కుటుంబం, అనేక మంది గౌరవనీయ అతిథులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో లెజెండరీ ANR గురించి తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. ANR లెగసీకి తగిన ట్రిబ్యూట్ గా, ఇండియన్ సినిమాకి చేసిన అసాధారణ సేవలకు గుర్తింపుగా పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత చిరంజీవికి ప్రతిష్టాత్మక ANR అవార్డును ప్రదానం చేయనున్నట్లు అక్కినేని కుటుంబం ప్రకటించింది. ఈ నెల 28వ తేదీన జరగనున్న ఈ అవార్డు ప్రదానోత్సవానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
Raashi Khanna: పెళ్లిపై రాశి ఖన్నా కీలక వ్యాఖ్యలు
Also Read
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
ఏఎన్ఆర్ అవార్డు వేడుకకు ఆహ్వానించేందుకు నాగార్జున లాంఛనంగా చిరంజీవిని కలిశారు. పద్మవిభూషణ్‌ను అందుకున్న రెండవ తెలుగు వ్యక్తి చిరంజీవి, 2011లో ఏఎన్‌ఆర్‌గారే తొలిసారిగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును ఇండియన్ సినిమా డోయన్, పద్మవిభూషణ్ అమితాబ్ బచ్చన్, చిరంజీవికి అందజేయనున్నారు. “మా నాన్న ANR గారి శత జయంతి వేడుకలు జరుపుకుంటున్న ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది! 🎉 ఈ మైలురాయికి గుర్తుగా ANR అవార్డ్స్ 2024కి అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారిని ఆహ్వానించడం ఆనందంగా వుంది.🙏 ఈ అవార్డు ఫంక్షన్‌ను మరపురానిదిగా చేద్దాం! 🙌 @AnnapurnaStdios #ANRLivesOn #ANRNationalAward #ANR100Years” అని నాగార్జున తన X అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. నాగార్జున, చిరంజీవిని ఒకే ఫ్రేమ్ లో చూడటం అభిమానులకు స్పెషల్ ట్రీట్ గా నిలిచింది.
నాగార్జున, చిరంజీవి, అమితాబ్ బచ్చన్, పలువురు ప్రముఖులు పాల్గొనే ఈ ఈవెంట్ విజువల్ ఫీస్ట్‌గా వుండబోతోంది. ఇక ఈ ANR అవార్డు గతంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ దేవానంద్, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి షబానా అజ్మీ, శ్రీమతి అంజలీ దేవి, డాక్టర్ వైజయంతిమాల బాలి, భారతరత్న అవార్డు గ్రహీత శ్రీ లతా మంగేష్కర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కె. బాలచందర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి హేమమాలిని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ శ్యామ్ బెనెగల్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ అమితాబ్ బచ్చన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ ఎస్.ఎస్.రాజమౌళి, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీదేవి బి కపూర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ రేఖ లాంటి దిగ్గజాలకు అందించారు. ఇక ఈ వేడుకలో కీరవాణి సంగీత విభావరి కూడా ఉండనుందని ఈ సంధర్భంగా వెల్లడించారు నిర్వాహకులు.
తాజావార్తలు
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!