Mega Star : చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ కి కళ్లను దానం చేసిన మురళీ మోహన్..?
- అన్ని దానాల్లోకెల్లా అవయవదానం మిన్న ఇది నేటి మాట
- మేకప్ మ్యాన్ కొల్లి రాము దాతృత్వం
- సోదరి అవయవాలు - శరీరాన్ని కూడా దానం చేసిన రాము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్ని దానాల్లోకెల్లా అవయవ దానం అత్యున్నతమైనదనేది నేటి మాట. మానవ జన్మకు మహా అవకాశమని, నేత్ర దానం తో అంధుల్లో వెలుగులు, అవయవదానంతో ఆరిపోయే ప్రాణాలకు ఆయుష్షును, పోతూ పోతూవేరొకరిజీవితంలో వెలుగులు నింపి, సరికొత్త జీవితాన్ని ఇవ్వడం అంటే మాములు విషయం కాదు. చూపు లేని వారికి చూపును ప్రసాదించేలా నేత్రదానంలో కీలక పాత్ర పోషించటమే కాదు, ప్రమాదాల్లో ఉన్న వ్యక్తులకు సకాలంలో రక్తాన్ని అందించే సేవా కార్యక్రమాల్లో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ ముందుంటుంది.
తెలుగు చిత్ర సీమకు చెందిన సీనియర్ నటుడు మురళీ మోహన్ మేకప్ మ్యాన్ కొల్లి రాము సోదరి పమిడి ముక్కల రాజ్యలక్ష్మి మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని వారు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ కి చేరవేయగా వెంటనే వారు స్పందించారు. అలా రాజ్యలక్ష్మిగారు తాను చనిపోయినప్పటికీ నేత్రదానం చేయటం ద్వారా మరో ఇద్దరికీ చూపును అందించి ఎందరికో ఆదర్శప్రాయంగా మారారు. ఈ సందర్భంగా మురళీమోహన్గారికి, కొల్లి రాము ఆయన కుటుంబ సభ్యులకు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ కి ధన్యవాదాలను తెలియజేశారు. అలాగే పమిడి ముక్కల రాజ్యలక్ష్మి శరీరాన్ని కూడా అపోలో ఆస్పత్రికి దానం చేశారు. దేహ దానంతో భావి వైద్యుల పరిశోధనలకు ఉపయోగ పడవచ్చు. ప్రమాదవశాత్తు అవయవాలు కోల్పోయినవారికి అవయవాలు దానం చేసి ఆ వ్యక్తుల జీవితానికి పునర్జన్మ ప్రసాదించేందుకు రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులకు ముందుకు రావడం అభినందించదగ్గ విషయమని అపోలో ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.ఇలా అవయవాలు దానం చేసి ఎందరికో మేకప్ మ్యాన్ కొల్లి రాము ఆదర్శప్రాయంగా నిలిచారని ఇండస్ట్రీలోని పలువురు రామును అబినందించారు.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!