టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మజాకా’. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా మన్మధుడు మెరిసిన అన్షు మజాకాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమాగా రానుంది. రాయాన్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత సందీప్ కిషన్ నుండి వచ్చిన ఈ సినిమా గత రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ తో రిలీజ్ అయింది.
మహాశివరాత్రి కానుకగా విడుదలైన మజాకా ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందంటే.. ముందునుండి అనుకున్నట్టు ఈ సినిమా పూర్తిగా అవుట్ అండ్ అవుట్ కామెడి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకులను బాగా నవ్వించగలిగాడు దర్శకుడు. కానీ సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి కామెడీ ఇక చాలు ఎమోషనల్ గా తీసుకువెళదాం అనుకుని ఆ ట్రాక్ లో సినిమాను నడిపాడు. అయితే ఆ ఎమోషన్స్ కు ప్రేక్షకుడు కనెక్ట్ అవకపోవడం రైటింగ్ లోపమా లేదా డైరెక్షన్ లోపమా అనేది వారికే తెలియాలి. రావు రమేష్, అన్షు ల ట్రాక్ మాత్రం బాగా నవ్వించిందని ఓ నేటిజన్ కామెంట్ చేసాడు. ఇక మరొక నెటిజన్ మజాకా ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు మజా వచ్చింది. కానీ సెకండ్ హాఫ్ నవ్వులు కాస్త తగ్గాయి, ఎదో అలా అలా సాగుతూ వెళుతుంది. కథ, కథనం ఊహించినట్టుగానే సాగుతుంది. ఓవరాల్ గా మజాకా చక్కగా నవ్విస్తూ, సరదాగా సాగిపోయే సినిమా అని కామెంట్ చేసాడు.