శ్రీసింహా, సత్య, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన చిత్రం మత్తువదలరా 2. మత్తువదలరాకు సిక్వెల్ గా వచ్చినా ఈ సినిమాకు రితేష్ రాణా దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 13న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. శ్రీ సింహ కోడూరి మరియు సత్య, వెన్నెల కిశోర్ కామెడీకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పుకుంటూ థాంక్స్ మీట్ నిర్వహించారు మేకర్. ఈ సినిమాను క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించారు.
Also Read : SIIMA 2024 : నాని సినిమాలకు సలాం కొట్టిన ‘సైమా’.. మొత్తం ఎన్ని అవార్డ్స్ వచ్చాయంటే..?
చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబడుతోంది. రిలీజైన మొదటి రెండు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా రూ. 11 గ్రాస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ కలెక్షన్స్ సాధించడం విశేషం. మరోవైపు ఓవర్సీస్ లోను మత్తువదలరా -2 రెండు రోజులకు $500K పైగా కలెక్ట్ చేసింది. ఇక గడచిన 24 గంటల్లో ఈ సినిమా 97.1k టికెట్స్ బుక్ అయినట్టు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. మొదటి రెండు రోజుల్లోనే హాఫ్ మిలియన్ మార్క్ చేరుకుంది ఈ సీనిమా. ఈ రోజు రేపు హాలిడే కావడంతో భారీ బుకింగ్స్, కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది. మరోవైపు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు మత్తువదలరా -2 యూనిట్ ను అభినందించిన సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో ఎటువంటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి