సీనియర్ బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా తన అందం, నటనతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టిన మనీషా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కానీ షైన్ వెనుక, ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదురయ్యాయి. మానసిక, శారీరకంగా గడిపిన సవాళ్లలో, ముఖ్యంగా ప్రేమ సంబంధాలు ఆమె జీవితం పై భారీ ప్రభావం చూపించాయి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఒంటరితనంలోని అనుభవాలను స్పష్టంగా పంచుకుంది..
Also Read : Rasha Tadaney : టాలీవుడ్ లో బంపర్ ఆఫర్ అందుకున్న..రాషా తడానీ !
నటిగా ఉన్న సమయంలో, ఆమె ప్రేమ సంబంధాలు కూడా మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. అగ్ని సాక్షి సినిమాలో నానా పటేకర్‌తో కలసి నటిస్తున్న సమయములో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సౌదాగర్ సినిమాలో వివేక్ ముష్రాన్‌తో, మార్కెట్ సినిమాలో ఆర్యన్ వెడ్‌తోనూ సంబంధాల గురించి ప్రచారాలు వచ్చాయి. అలాగే, డీజే హుస్సేన్, క్రిస్పిన్ కొనరాయ్, సిసిల్ అంథోనీ, డోరిస్ వంటి పేర్లు కూడా వినిపించాయి. ఈ మొత్తం అనుభవాల తర్వాత 2010లో సామ్రాట్ దహాయ్‌తో వివాహం జరిగింది. కానీ..
ఆ బంధం రెండు సంవత్సరాలకే ముక్కలైంది. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన మనీషా.. ‘తన జీవితంలో ఈ రిలేషన్‌షిప్స్ కారణంగా ఎక్కువ సమయం, శక్తి వృధా అయ్యింది, వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడింది. ప్రస్తుతం సింగిల్‌గా ఉన్న.. ఇలానే నాకు ప్రశాంతంగా ఉంది. ఒంటరితనపు భావన కొన్ని సమయాల్లో కలిగిన, ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి, స్వతంత్రంగా జీవించడం గొప్ప అనుభవం’ అని పేర్కొన్నారు. మనీషా జీవితంలో ఒక ‘బ్యాడ్ ఫేజ్’ ఉండటం సహజం అని, కానీ రిలేషన్స్ వల్ల అనారోగ్యకర ప్రభావాలు కూడా ఎదుర్కొన్నట్లు స్పష్టంగా తెలిపారు.