ManiRatnam : థగ్ లైఫ్ ఫస్ట్ గ్లింప్స్.. వింటేజ్ కమల్ బ్యాక్
- కమల్ హాసన్ లేటెస్ట్ సినిమా థగ్ లైఫ్
- దర్శకత్వం వహిస్తున్న మణిరత్నం
- థగ్ లైఫ్’ఫస్ట్ గ్లిమ్స్ ను సూపర్ రెస్పాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోకననాయకుడు కమల్‌హాసన్ హీరోగా 2022 లో వచ్చిన విక్రమ్ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి ప్రేక్షకులకు తెలిసేలా చేసాడు. అదే జోష లో శంకర్దర్శకత్వంలో భారతీయుడు సీక్వెల్ ఇండియన్ – 2 చేసాడు. ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. కాస్త గ్యాప్ తో ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు కమల్. నాయకన్ సినిమా తర్వాత దాదాపు 36 సంవత్సరాల తర్వాత మణిరత్నం కమల్ కాంబోలో సినిమా రాబోతోంది.
Also Read
పాన్ ఇండియా స్థాయిలో భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాను ఆ మధ్య గ్రాండ్ గా స్టార్ట్ చేసాడు దర్శకుడు మణిరత్నం. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విదులైనా నాటి నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా నేడు విలక్షణ నటుడు కమల్ హాసన్ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ తో పాటు, రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ టీజర్ విడుదల చేసారు. ఈ సినిమాలో తమిళ యంగ్ హీరో శింబు ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. గ్లిమ్స్ ను ఒకసారి చుస్తే వింటేజ్ కమల్ ను మరోసారి ప్రేక్షకులకు చూపించాడు మణిరత్నం. ఇక శింబు ఈ సినిమాలో పవర్ఫుల్ రోల్ లో కనిపించబోతున్నట్టు చూపించారు. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో రానున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలిపింది. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్రిష కథానాయిక, మలయాళ నటుడు జోజు జార్జ్‌తో పాటు హీరో గౌతమ్ కార్తీక్, ఐశ్వర్య లక్ష్మీ ఇందులో కీలక పాత్రలు పోషించనున్నారు. ఎ.ఆర్.రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు.
Also Read : AHA : జనక అయితే గనక గోల్డెన్ అఫర్
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!