Mangli: అంతా విష ప్రచారం.. ‘బాబు’ని నేనేం అనలేదు.. ప్రమాణం చేసి చెబుతున్నా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా జరుగుతున్న ప్రచారం గురించి మంగ్లీ సుదీర్ఘ క్లారిటీ ఇచ్చింది. ఆమె షేర్ చేసిన నోట్ లో ఉన్న వివరాలు యధాతధంగా మీ కోసం అందిస్తున్నాం. నన్ను నా పాటను ఆదరిస్తున్న, అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా కృతజ్ఞతలు. మీ రుణం మంగ్లీ ఎప్పటికీ తీర్చుకోలేనిది. గత వారం రోజులుగా నా పై జరుగుతున్న విష ప్రచారాన్ని చెప్పుకునేందుకు ఈ బహిరంగ లేఖ ద్వారా మీ ముందుకు వచ్చాను. శ్రీకాకుళంలో ప్రతి ఏటా జరిగే గొప్ప ఆధ్యాత్మిక వేడుకైన అరసవల్లి రథసప్తమి వేడుకల్లో Live Concert కు నన్ను ఆహ్వానించినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ఈ Musical Event ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో మీ అందరికీ తెలుసు. శ్రీకాకుళం ప్రజలు నాపై చూపిన అభిమానం ఈ జన్మలో మరువలేనిది. ‘
మరో జన్మంటూ ఉంటే ఈ సిక్కోలు గడ్డపై పుడతానని వేదికపైనే నా కృతజ్ఞత తెలుపుకున్నాను. ఈ Program లో కేంద్రమంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని లక్షలాది జనం ముందు నాతో పాటు నా టీంను సత్కరించి అభినందించారు. కార్యక్రమం అనంతరం తొలిసారిగా ప్రత్యక్ష దైవం శ్రీసూర్యభగవానుని ఆలయాన్ని దర్శించాలనుకున్న సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుటుంబం ఒక కళాకారిణిగా నన్ను వాళ్లతో పాటు ఆహ్వానించారు. ఇక్కడ మంత్రి, ఎమ్మెల్యే స్థానంలో ఎవరున్నా దైవ దర్శన భాగ్యం కల్పించేవారు. కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా ఆ కుటుంబం నన్ను ఒక ఆడబిడ్డగా ఆశీర్వదించారు. గొప్ప మనసుతో కళాకారిణిగా నన్ను గౌరవించడం తప్పు అవుతుందా? దేవుని కార్యక్రమానికి ఒక రాజకీయ పార్టీ ముద్రవేసి ఆరోపణలు చేయడం అన్యాయం కాదా?
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీకి చెందిన కొందరు లీడర్లు సంప్రదిస్తే పాట పాడాను. దాని తర్వాత రెండు నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేశాను. అక్కడి స్థానిక నేతలు వ్యక్తిగతంగా తెలిసిన కారణంగా ప్రచారంలో పాల్గొనాల్సి వచ్చింది కానీ ఇతర పార్టీలకు సంబంధించిన ఎవరినీ ఒక్క మాట అనలేదు. దూషించలేదు. నేను ఎక్కడా పార్టీ జెండా ధరించలేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అప్పటి పరిస్థితుల్లో ఒక కళాకారిణిగా పాడాను, వైఎస్సార్సీపీ ఒక్కటే కాదు, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలతో పాటు దాదాపు అన్ని పార్టీల లీడర్లకు పాటలు పాడాను. కానీ అప్పటికే నాపై రాజకీయ పార్టీ ముద్ర పడటంతో మిగతా పార్టీలకు చెందిన వాళ్లకు నా పాట దూరమయ్యింది. దీంతో చాలా అవకాశాలు కోల్పోయాను, అవమానాలు ఎదుర్కొన్నాను. ఈ కారణంగానే 2024 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీతో పాటు అన్ని ప్రధాన పార్టీలు ప్రచార పాటలు పాడాలని కోరినా సున్నితంగా తిరస్కరించాను. నా పాట ప్రతీ ఇంట్లో పండుగ పాట కావాలే కాని పార్టీ పాట కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. రాజకీయాలకు అతీతంగా నన్ను అందరూ ఆదరించాలని, అభిమానించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
బంజారా జాతి నుండి వచ్చి కల్చరల్ పాటలు పాడ తున్న సందర్భంలో రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన శ్రీ వేంకటేశ్వర సంగీత కళాశాలలో చదువుకున్నా అనే నేపథ్యంలో ఒక కళాకారిణిగా గుర్తించి ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా నియమిస్తున్నట్లు ఛానల్ అధికారులు నన్ను సంప్రదించారు. నేను ఆ పదవి స్వీకరించాలా? వద్దా? అని చాలా రోజులు తర్జన భర్జన పడ్డాను. ఇది రాజకీయ పదవి కాదని, అప్పటికే చాలా మంది కళాకారులు సలహాదారులుగా చేశారని నా శ్రేయోభిలాషులు సూచించారు, పైగా మా ఇంటి ఇలవేల్పు శ్రీవారికి సన్నిధిలో ఎలాంటి అవకాశం వచ్చినా తిరస్కరించరాదనే ఉద్దేశంతో ఆ పదవిని కొనసాగించానే తప్ప ఎక్కడా బహిరంగంగా ఆ పదవి గురించి ప్రకటించుకోలేదు. నేను పాటను నమ్ముకునే వచ్చాను కాని పార్టీలను, పదవులను నమ్ముకొని రాలేదని వేడుకుంటున్నాను.
ఫేక్ ప్రచారం
నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఎక్కడా అనని మాటలను, ఆధారాలు లేకుండా వాస్తవాలు తెలియకుండా కొందరు కావాలనే రాజకీయ లబ్ధి కోసం ఫేక్ న్యూస్ ని ప్రచారం చేస్తున్నారు. ‘చంద్రబాబు గారికి నేను పాట పాడను అన్నది ముమ్మాటికి వాస్తవం కాదని ప్రమాణం చేసి చెబుతున్నాను’. మొదట్లో వైఎస్సార్సీపీ పాడిన కారణంగా కావచ్చు 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎవరూ కూడా నన్ను సంప్రదించలేదు. దేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన అంత పెద్ద మనిషిని నేను అంత మాట అన్నానని ప్రచారం చేయడం న్యాయమేనా ? 2019 ఎన్నికల్లో వీడియో క్లిప్పులతో రాజకీయ పార్టీలకు ముడిపెట్టి నాపై విష ప్రచారం చేస్తున్నారు. ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి బలహీనురాలిపై ఇలాంటి వ్యతిరేక ప్రచారం చేయడం చాలా బాధాకరం.
నాకు ఎలాంటి రాజకీయ అభిమతాలు కానీ, పక్షపాతాలు గానీ లేవు, నేను ఏ పార్టీ ప్రచార కార్యకర్తను కాదు. అందరు నాయకులపై నాకు గౌరవం ఉంది. ప్రతి ఒక్కరూ నాకు ఆదర్శనీయులు. నేను హాజరయ్యే కార్యక్రమాలు కేవలం కళాదృష్టితోనే చూడమని వేడుకుంటున్నాను. ఒక కళాకారిణిగా నాకు నా పాట అన్నింటికన్నా ముఖ్యం. కళకు, కళాకారులకు ఎల్లలులేవని, ఎటువంటి బేధభావాలూ ఉండవని నమ్ముతున్నాను. దయచేసి నా పాటకు రాజకీయ రంగు పులమొద్దని, ఏ రాజకీయ పార్టీలతో నాకు సంబంధం లేదని మరోసారి మీకు విన్నవించుకుంటున్నాను. మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను నా పాటను ఇలాగే ఆదరిస్తారని ఆశీర్వదిస్తారనికోరుకుంటున్నాని ఆమె వెల్లడించారు.
తాజావార్తలు
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
-
Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
-
Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
-
Electricity Bill Reduction : ఇలా చేస్తే మీ కరెంట్ బిల్లు సున్నా!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?