సూపర్ స్టార్ మహేష్ బాబు , రాజమౌళి కాంబోలో భారీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇది భారతీయ సినిమా స్థాయిని కొత్త ఎత్తులకు తీసుకెళ్లే ప్రాజెక్ట్ అవుతుందని అభిమానులు పూర్తి నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతానికి ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుచుకుంటున్న ఈ చిత్రం ‘బాహుబలి’ ‘RRR’ సినిమాలకు మించి ఉంటుందని భావిస్తున్నారు. ఇక సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి, . తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ‘SSMB 29’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలతోపాటు ప్రియాంక, మహేశ్‌లపై ఓ పాటను కూడా రాజమౌళి చిత్రీకరించారట. ఏప్రిల్ 30తో పూర్తయిన ఈ పాట చిత్రీకరణతో ఈ షెడ్యూల్ కంప్లీటయ్యిందట. కాగా తాజా సమాచారం ప్రకారం రాజమౌళి తన టీమ్‌కి సమ్మర్ హాలీడేస్ ప్రకటించాడు. జూన్ 10న తన నెక్ట్స్ షెడ్యూల్ డేట్‌ని ఫిక్స్ చేశాడు రాజమౌళి. కాగా జూన్ 10 నుంచి ఈ సెట్‌లోనే కథలో కీలకమైన వారణాసి నేపథ్య సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. 2026 లో ఈ సినిమా విడుదలవుతుందని అభిమానులు ఆశిస్తున్నప్పటికి.. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం 2027 దాకా ఆగాల్సిందేనట. ఇక మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నానా పటేకర్ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే మనకు తెలిసి మహేష్ ఏ మాత్రం సమయం దొరికిన కూడా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు జంప్ అవుతాడు. ఇక ఇప్పుడు కూడా అదే ప్లాన్‌లో ఉన్నరట మహేష్..