Mahesh Babu MS Dhoni Photo Goes Viral in Social Media: ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే ఫ్రేమ్లో కనబడితే ఎలా ఉంటుంది. ఆ ఇద్దరి స్టార్ల అభిమానులకైతే ఒక రకంగా పండుగనే చెప్పాలి. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో దాదాపు మీరు థంబ్ నైల్ ద్వారా చూసేసే ఉంటారు. అవును వారిలో ఒకరు క్రికెట్ సూపర్ స్టార్ ఎంఎస్ ధోని అయితే మరొకరు సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు. అసలు విషయం ఏమిటంటే నిన్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం బాంబేలో ఘనంగా జరిగింది. అంబానీ అధికారిక నివాసంలో సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన దిగ్గజాల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి వెంకటేష్, మహేష్ బాబు, రాణా వంటి వాళ్ళు హాజరయ్యారు. అయితే స్పోర్ట్స్ నుంచి పెద్ద ఎత్తున హాజరయ్యారు. ధోని, సచిన్ టెండూల్కర్ వంటి వాళ్లు కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Sri Satya: డీజే టిల్లు కొంపముంచాడు.. సంబంధం అంటగట్టేస్తున్నారు.. సర్జరీపై పెదవి విప్పిన శ్రీ సత్య
అయితే ఎప్పుడు కలిశారు? ఏ క్షణాన కుదిరిందో తెలియదు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ధోని ఫోటో దిగారు. అయితే ధోని మహేష్ బాబుతో దిగాలని అనుకున్నారో లేక మహేష్ బాబు ధోనితో దిగాలని అనుకున్నారో తెలియదు. కానీ ఒక ఫోటో అయితే దిగారు. దాన్ని మహేష్ బాబు సోషల్ మీడియా హ్యాండిల్స్ మైంటైన్ చేసే మేనేజర్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి రిలీజ్ చేశారు. ఇక అది సోషల్ మీడియాలో రిలీజ్ అయినప్పటి నుంచి వైరల్ అవుతుంది. ధోని మహేష్ బాబు ఫోటో ఒకరకంగా సోషల్ మీడియాలో వైరల్ కాదు ట్రెండ్ కూడా అవుతుంది అని చెప్పవచ్చు. ఇక మహేష్ బాబు ప్రస్తుతానికి రాజమౌళి సినిమా కోసం కష్టపడుతున్నాడు ఎప్పుడూ మొదలవుతుందో తెలియని ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.