తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి తమిళ సినీజనం విరాళాల రూపంలో కొత్త ప్రభుత్వానికి తమ సంఘీభావాన్ని తెలియచేస్తున్నారు. కరుణానిథికి చిత్రసీమతో ప్రత్యక్ష అనుబంధం ఉంది. అలానే ఆయన కుమారుడు స్టాలిన్ తనయుడు ఉదయనిధి సైతం హీరోగా, నిర్మాతగా కోలీవుడ్ లో తనదైన ముద్రను వేశారు. ఆయన భార్య దర్శకురాలిగా చిత్రాలు రూపొందిస్తోంది.
Also Read : ఖుషీ బికినీ ట్రీట్ తో… కుర్రాళ్లు ఖుషీ!
ఎన్నికల సమయంలో కొందరు సినీ తారలు అటు కమల్ హాసన్ కు, ఇటు బీజేపీకి, మరో వైపు అన్నాడీఎంకేకి మద్దత్తు పలికినా… తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉండటంతో ఇప్పుడు అందరూ స్టాలిన్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పనిలో పనిగా కరోనా రిలీఫ్ ఫండ్ కోసం అన్నట్టుగా స్టాలిన్ కు భారీ ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. అదే క్రమంలో లైకా ప్రొడక్షన్స్ తరఫున నిర్మాత అల్లి రాజా సుభాకరన్ ఈ రోజు రెండు కోట్ల రూపాయల చెక్కును సెక్రటేరియట్ కు వెళ్ళి స్టాలిన్ ను స్వయంగా కలిసి అందచేశారు.