తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇటీవల రిలీజ్ అయిన కూలి పవర్ హౌస్ సాంగ్ తో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగాయి.
Also Read : ART CINEMASS: రవితేజ ART మాల్.. ఓపెనింగ్ ఆ సినిమాతోనే
కాగా ఈ సినిమా ట్రైలర్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందుకనుగుణంగా మేకర్స్ కూడా ట్రైలర్ డేట్ ను ఫిక్స్ చేసారు. ఆ విషయాన్ని తెలియాజేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ట్రైలర్ పోస్టర్ అనుకోని ట్రోలింగ్ కు గురైంది. హాలీవుడ్ సినిమాలైన మాడ్ అమె వెబ్ పోస్టర్ ను కాపీ పేస్ట్ చేసి రిలీజ్ చేసారు. దాంతో సోషల్ మీడియాలో కూలీ ట్రోలింగ్ గురైంది. ఈ టైమ్ లో ఇలాంటి కాపీ కొట్టడం అవసరమా లోకి అని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా కూలీ ట్రైలర్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రు ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఈ వేడుకకు సూపర్ స్టార్ రజిని, అక్కినేని నాగార్జున దర్శకుడు లోకేష్ కానగరాజ్ హాజరుకానున్నారు.