పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 24న భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ ను నిర్వహిస్తోంది యూనిట్. ఈ ఉదయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మీడియా మీట్ నిర్వహించారు. కేవలం మీడియాను మాత్రమే ఈ ఈవెంట్ కు అనుమతించారు. ఆ సందర్భంగా పవర్ స్టార్ స్పీచ్ విశేషంగా ఆకట్టుకుంది.
Also Read : Pawan Kalyan : నా గత సినిమాలను అప్పటి ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టింది
ఇక మరోవైపు ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు ఇరు రాష్ట్రల సినిమాటోగ్రఫీ మంత్రులు కూడా హాజరుకాబోతున్నారు. అయితే ఈ వేడుకకు నిన్నటి వరకు కూడా అనుమతి లభించలేదు. ఈవెంట్ ఉంటుందా ఉండదా అనే డైలామాలో గుడ్ న్యూస్ ఇచ్చింది తెలంగాణ పోలీస్ శాఖ. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు లైన్ క్లియర్ చేసింది. హరిహర వీరమల్లు ప్రీరిలిజ్ ఫంక్షన్కి కావలిసిన అన్నిఅనుమతులని ఇచ్చింది. అలాగే గతంలో జరిగిన పర్యవసానాలు దృష్టిలో పెట్టుకుని ప్రీరిలీజ్ ఈవెంట్కు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు పోలీసులు. ఈవెంట్ కు కేవలం వెయ్యి నుంచి 1500 మందికి మాత్రమే ఆడియెన్స్ ఉండాలి. ఎటువంటి సంఘటనలు జరిగిన నిర్మాతే పూర్తి బాధ్యత వహించాలి. వేదిక బయట క్రౌడ్ మొత్తాన్ని సినిమా యూనిట్ కంట్రోల్ చేసుకోవాలి, అక్కడ ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగిన నిర్మాతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందిని షరతులు విదించి అనుమతులు ఇచ్చారు పోలీసులు.