మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోయిన్‌గా పరిచియమై తొలి సినిమాతోనే అందర్ని ఆకట్టుకుంది. దాదాపు అందరు యంగ్ హీరోలందరితో జతకట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక మెగా హీరో వరుణ్ తేజ్‌ను లావణ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి సినిమాలకు కొంత దూరంగా ఉంటుంది. కానీ ఆ మధ్య ‘మిస్ పర్‌ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన లావణ్య తాజాగా ‘సతీ లీలావతి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.
తాతినేని సత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రీసెంట్‌గానే పూజా కార్యక్రమాలు జరిపుకోగా ప్రస్తుతం టీం చకచకా షూటింగ్‌ను ఫినిష్ చేస్తోంది. ఇందులో భాగంగా తాజ సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయినట్లు లావణ్య త్రిపాఠి ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్ట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో హీరో హీరోయిన్ల మీద కీలక సన్నివేశాలను చిత్రీకరించారట. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో, దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో, ప్రొడక్షన్ నెం.1గా ఈ చిత్రాన్ని నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు టీం పేర్కొంది.