Lavanya Says Her Fight is to get Raj Tarun Back into her Life: హీరో రాజ్ తరుణ్ -లావణ్యల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది . పోలీసులు ఈ వ్యవహారంలో కేసు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్ లో రాజ్ తరుణ్ ని నిందితుడిగా చేర్చారు. రాజ్ తరుణ్ తో లావణ్య పదేళ్లు సహజీవనం చేసిన మాట వాస్తవమేనని, వీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉన్నారని లావణ్య చెబుతున్న మాట నిజమేనని తేల్చారు. ఇక ఈ అంశం మీద ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన లావణ్యను రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కూడా మీకు తెలుసని మీరు చెబుతున్నారు కానీ వాళ్ళు ఈ అంశం మీద మాట్లాడక పోవడానికి కారణం ఏమిటి అని మీరు అనుకుంటున్నారు అని అడిగితే ఆమె సమాధానం ఇచ్చింది.
Ganesh Chaturthi: లంబోధరుడిని ప్రతిష్ఠిస్తున్నారా?.. ఇదే అనువైన ముహూర్తం
నేను మీకు ఫోటోలు, వీడియోలు ఇచ్చాను. ఈ సంవత్సరం జనవరి 19వ తేదీన కూడా మా అత్త మామ నా తల్లిదండ్రులు హైదరాబాద్ ఎయిర్పోర్టుకి వచ్చి నన్ను ఫ్లైట్ ఎక్కించారు.. వాళ్ళ ఇంట్లో అందరికీ తెలుసు. ఈ పదేళ్లు మేమిద్దరం కలిసి వినాయక చవితి చేసుకునేవాళ్ళం, ఇద్దరం పీటల మీద కూర్చుని పూజ చేసుకునే వాళ్ళం. కానీ ఈ రోజు అతను లేడు అతను తిరిగి రావాలనేదే నా పోరాటం అందుకే మీడియా ముందుకు వచ్చాను అని లావణ్య చెప్పుకొచ్చింది.