తమిళ నటుడు ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “కుబేర”, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ మల్టీ-స్టారర్ డ్రామా, తాజాగా వివిధ భాషల్లో ఒకేసారి విడుదలైంది. ఆసక్తికరమైన సోషల్ థీమ్..ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌గా ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందుతోంది. ఇక ఈ మూవీ థియేటర్‌లో మంచి టాక్ తో పాటు వసూళ్లు సాధింస్తోంది. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీ, శాటిలైట్ హక్కులు కూడా భారీ డీల్స్‌తో అమ్ముడయ్యాయట.
Also Read : DSP : మళ్లీ ఫాంలోకి వచ్చిన దేవి శ్రీ.. ‘కుబేరా’ తో హ్యాట్రిక్ కొట్టాడుగా
సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. థియేటర్ రన్ పూర్తయ్యాక, ‘కుబేర’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కి సిద్ధంగా ఉంటుంది. భిన్నమైన కథాంశాలు, సోషల్ ఎలిమెంట్స్ కోసం ప్రైమ్ వీడియో ఎప్పుడూ ముందుంటుంది. అందులో భాగంగానే ఈ సినిమా హక్కులను కూడా పొందింది. ఇక శాటిలైట్ హక్కుల విషయానికొస్తే, స్టార్ మా ఈ హక్కులను సొంతం చేసుకుంది. తెలుగు టెలివిజన్ ఆడియెన్స్ కోసం త్వరలోనే ఈ సినిమా ప్రసారమయ్యే అవకాశముంది. స్టార్ మా ఇప్పటికే స్టార్ హీరోల సినిమాల టెలికాస్ట్ హక్కుల విషయంలో ముందంజలో ఉంది. ఇప్పుడు ‘కుబేర’ విషయంలో కూడా అంతే. ఇక థియేటర్ లో విజయవంతంగా రన్ పూర్తి చేసిన తర్వాత, త్వరలోనే ‘కుబేర’ అమెజాన్ ప్రైమ్.. అలాగే స్టార్ మా లో ప్రేక్షకుల ముందుకు రానుంది.