కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ కుబేర ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఏసియన్ సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ సినిమాను జూన్ 20న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, గ్లింప్స్ గట్రా ఆడియెన్స్‌లో మంచి స్పందన అందుకోగా. మనకు తెలిసి శేఖన్ కమ్ముల మూవీస్ అంటే క్లసిక్‌గా ఉంటాయి. కానీ ఈ మూవీతో తన డైరెక్షన్ మార్చినట్లు గా కనిపిస్తోంది. ఇక ఇటీవల నాగార్జున ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అయితే తాజాగా ఈ మూవీ రన్ టైం గురించి ఓ వార్త వైరల్ అవుతుంది.
Also Read : Aishwarya Rajesh : హిట్ పడిన కూడా.. ఐశ్వర్య రాజేష్‌ను పట్టించుకోరేంటీ..?
ముందు నుండి శేఖర్ కమ్ముల సినిమాలు దాదాపు ఒకింత ఎక్కువ రన్ టైం లోనే కనిపిస్తాయి. అలానే ‘కుబేర’ మూవీకి కూడా అంతకు మించిన రన్ టైం ని శేఖర్ కమ్ముల కట్ చేసినట్టు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ ‘కుబేర’ సినిమా ఏకంగా 3 గంటల 15 నిమిషాలు రన్ టైం లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజుల్లో ఎంతో అద్భుతమైన కంటెంట్ ఉంటే తప్ప నిడివి ఎక్కువ ఉన్న సినిమాలు నడవడం కష్టతరం అయింది. ఇలాంటి సమయంలో ‘కుబేర’ రన్ టైం రిస్క్ తీసుకుంటుంది అనే చెప్పాలి. కానీ శేఖర్ కమ్ముల సినిమాలకు క్లాస్ ఆడియన్స్ బేస్ ఉంటుంది.. వారిని నమ్ముకొని ఇంత రన్ టైం లాక్ చేసి ఉంటారు. మరి ఆడియెన్స్‌ని ఈ సినిమా ఎంగేజ్ చేసేలా ఉంటే పర్వాలేదు కానీ కొంచెం తేడా అయినా ఎఫెక్ట్ అవుతుంది. మరి మేకర్స్ అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకున్నారో లేదో వేచి చూడాల్సిందే.