‘లవ్ స్టోరీ’ మూవీ తర్వాత దాదాపు 4 ఏళ్ళు గ్యాప్ తీసుకుని దర్శకుడు శేఖర్ కమ్ముల ‘కుబేర’ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో తమిళ స్టార్ ధనుష్ హీరోగా, రష్మిక హీరోయిన్‌గా నటించింది. అన్నిటికంటే మించి అక్కినేని నాగార్జున ఈ మూవీలో ఓ ముఖ్య పాత్ర పోషించారు. ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో వరుస అప్‌డేట్ లను వదులుతున్నారు మెకర్స్. ఇందులో భాగంగా ఇప్పటికే రిలీజ్ అయిన ‘కుబేర’ టీజర్‌కు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ రాగా, ధనుష్ లుక్ అదిరిపోయింది. నాగార్జున యాక్టింగ్ కూడా కొత్తగా అనిపించింది.
Also Read :Danush : కొడుకు కోసం ఒకటైన ధనుష్- ఐశ్వర్య.. పిక్స్ వైరల్
స్టోరి అర్థం కాకుండా టీజర్‌ను బాగా కట్ చేశారు. దానికి తోడు దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆసక్తి రేకెత్తించాయి. కానీ ఎక్కడ కూడా శేఖర్ కమ్ముల మూవీలా అనిపించలేదు.. అతను తన రూట్ మార్చుకుని చేసినట్లు అనిపించింది. ఇక ఇప్పటికే విడుదలైన మొదటి పాటకు మంచి రెస్పాండ్ రాగా తాజాగా.. మరో సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమాలోని రెండో సింగిల్ సాంగ్‌ను జూన్ 2న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు.