ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కాదు మూడు పిట్టలు బిషాణా సర్దుకోవాల్సిన సిచ్యుయేషన్ కోలీవుడ్‌లో. ఒక్క సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్.. కొన్ని సినిమాల భవిష్యత్తును తారుమారు చేసింది. సంక్రాంతి బరిలో దిగాల్సిన అజిత్ ‘విదాముయార్చి’ మూవీ కాపీరైట్స్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడింది. ప్రాబ్లమ్ సాల్వ్ కావడంతో ట్రైలర్‌తో పాటు కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 6న వస్తున్నట్లు ప్రకటించారు. మజిజ్ తిరుమనేని దర్వకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పోస్ట్ పోన్ కొన్ని సినిమాలకు తలనొప్పిగా మారింది.
Also Read : Mollywood : మెగాస్టార్ vs కంప్లీట్ స్టార్.. గెలుపెవరిది..?
చియాన్ విక్రమ్ అప్ కమింగ్ యాక్షన్ థ్రిల్లర్ వీర ధీర శూరణ్ 2 సంక్రాంతికి రావాలనుకుంటే పొంగల్‌కు వచ్చేస్తున్నానంటూ విదాముయర్చి డప్పుకొట్టడంతో విక్రమ్ తప్పుకోవాల్సిన పరిస్థితి. అజిత్ రాలేదు చియాన్ రాకపోవడంతో ఫెస్టివల్ సీజన్ కళతప్పింది. ఇక జనవరి ఎండింగ్‌లో వద్దామని ఫిక్స్ అయితే ఫిబ్రవరి ఫక్స్ వీక్ పై కర్చీఫ్ వేశాడు రేసర్ కమ్ హీరో అజిత్. నెక్ట్స్ మంత్ 6న విదాముయర్చిని దింపుతున్నాడు. క్లాషెస్, థియేటర్ ఇష్యూస్, కలెక్షన్లపై ప్రభావం చూపుతుందని చియాన్ మార్చికి షిఫ్ట్ అయ్యాడని కోలీవుడ్ ఇన్నర్ టాక్. అలాగే స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ రూపొందిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ మూవీ నిలవుక్కు ఎన్మేల్ ఎన్నాడీ కోబం, వాలంటైన్స్ వీక్‌ను టార్గెట్ చేస్తూ ఫిబ్రవరి 6న రావాలనుకున్నారు. కానీ విదాముయర్చి అదే డేట్‌కు రావడంతో ప్రీ పోన్‌కు సిద్ధమైనట్లు బజ్ నడుస్తోంది. NEEK జనవరి ఎండింగ్ లేదా పోస్ట్ పోన్ కూడా అవ్వొచ్చునని సినీ సర్కిల్లో చర్చ జరుగుతుంది. ఇదే కాదు ఫిబ్రవరిలో రావాలనుకున్న ధనుష్ పాన్ ఇండియన్ మూవీ కుబేర కూడా జూన్ లేదా జులైకి షిఫ్ట్ అయ్యిందని సమాచారం.