మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి, కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ వన్ వీక్ గ్యాప్‌లో బాక్సాఫీస్ దగ్గర వార్‌కు ప్రిపేర్ అవుతున్నారు. జనవరి ఎండింగ్‌లో ప్రెస్టిజియస్ ప్రాజెక్టులను ధియేటర్లలోకి తీసుకువస్తున్నారు. బ్రమయుగం, టర్బో తర్వాత మమ్ముట్టి నుండి వస్తున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్ డొమినిక్ అండ్ ది పర్స్. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ మీనన్ తెరకెక్కిస్తున్నాడు. జనవరి 23న రిలీజౌతున్న ఈ సినిమాతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న గౌతమ్ తన లక్ పరీక్షించుకోబోతున్నాడు. మమ్ముట్టి కంపెనీపై హీరోనే నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.
Also Read : Nelson : జైలర్ 2పై నెల్సన్ ఎక్స్‌పర్టేషన్స్ భారీగా పెంచేస్తున్నాడా..?
లాస్ట్ ఇయర్ క్రిస్మస్‌కు బడా బడ్జెట్ మూవీ బర్రోజ్‌తో ప్రేక్షకులను పలకరించాడు మోహన్ లాల్. బర్రోజ్ ప్లాపుతో హీరోగానే కాకుండా దర్శకుడిగా చేతులు కాల్చుకున్న ఈ కంప్లీట్ స్టార్ ఈ సారి ‘తుదరం’తో వస్తున్నాడు. ఫక్తు ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో శోభన నటిస్తోంది. 11 ఏళ్ల తర్వాత ఈ హిట్ పెయిర్ మళ్లీ జతకడుతోంది. తరుణ్ మూర్తి దర్శకుడు.
జనవరి 30న తుదరం సినిమాను థియేటర్లలోకి తీసుకు వస్తున్నాడు మోహన్ లాల్. మాల్కోటి వాలిబ్, బర్రోజ్ ప్లాప్స్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు కంప్లీట్ స్టార్. అలాగే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూస్తున్న మమ్ముట్టికి కూడా డొమినోస్ కీ మూవీ. జస్ట్ వారం గ్యాప్ లో వస్తున్న ఈ ఇద్దరు స్టార్లలో ఎవరు విన్నర్ అవుతారో. మమ్ముట్టి హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడా లేక మోహన్ లాల్ ప్లాపుల నుండి తుదరం గట్టెక్కిస్తుందా అనేది కొద్దీ రోజుల్లో తేలనుంది.