టాలీవుడ్‌లో కోలీవుడ్ డైరెక్టర్లకు ఉండే క్రేజే వేరు. వీరితో వర్క్ చేసేందుకు చాలా ఆసక్తికరంగా వెయిట్ చేస్తుంటగారు మన హీరోస్. కానీ తెలుగు హీరోలకు చుక్కలు చూపిస్తున్నారు తమిళ దర్శకులు. హీరోల కెరీర్‌కు డ్యామేజ్ చేసే చిత్రాలను అందించి.. ఫ్యాన్స్‌ను హర్ట్ చేస్తున్నారు. : దేవర ప్రమోషన్లలో భాగంగా తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్‌తో వర్క్ చేయాలనుందని ఓపెన్ కామెంట్స్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. వీళ్లే కాదు.. పలువురు హీరోలు కూడా కోలీవుడ్ దర్శకులతో వర్క్ చేయడానికి ఇంట్రస్ట్ చూపుతుంటారు. ఈ క్రేజ్‌తోనే తమిళ దర్శకులకు సై చెబితే.. టాలీవుడ్ హీరోలను భయపెట్టేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు.. నాగచైతన్యకు కస్టడీ రూపంలో, యుద్దం శరణం రూపంలో కృష్ణ మరిముత్తు డిజాస్టర్స్ అందించారు.
లింగు స్వామిని నమ్మితే..ది వారియర్‌ను రామ్ పోతినేనికి రిటర్న్ గిప్టుగా ఇచ్చాడు డైరెక్టర్. అలాగే గణేష్ రూపంలో ప్లాప్ ఇచ్చాడు. మురుగుదాస్ అంటే పడి చచ్చిపోతుంటారు టాలీవుడ్ స్టార్స్ అండ్ మూవీ లవర్స్. ఇతగాడు కూడా మహేష్ బాబుకు స్పైడర్ లాంటి బోరింగ్ మూవీ అందించాడు. జస్ట్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది మూవీ. ఇప్పుడు ఆర్టిస్టుగా స్థిరపడిన సముద్ర ఖని కూడా దర్శకుడిగా.. టాలీవుడ్ హీరోలకు గుర్తుండిపోయే లెసన్స్ నేర్పించాడు. నానికి జెండాపై కపిరాజ్, రవితేజకు శంభో శివ శంభో, పవన్-సాయితేజ్‌లకు బ్రో లాంటి ప్లాప్స్ ఇచ్చాడు
అంతేకాదు విజయ్ దేవరకొండను సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు ఆనంద్ శంకర్. నోటాతో విజయ్ దేవరకొండకి బిగ్ డిజాస్టరే అందించాడు ఈ కోలీవుడ్ ఫిల్మ్ మేకర్. ఇక పవన్ కళ్యాణ్ కు అయితే బిగ్ లిస్టే ఉంది. ఖుషి హిట్టిచ్చాడని మురిసిపోయే లోపే.. పులి లాంటి ప్లాప్ ఇచ్చాడు ఎస్ జే సూర్య. బంగారంతో ధరణి, పంజాతో విష్ణు వర్థన్ కూడా భారీ డిజాస్టర్స్ అందించారు. తొలిప్రేమతో కరుణాకర్ మెమొరబుల్ మూవీని ఇస్తే.. బాలు లాంటి ప్లాప్ మూవీని ఇచ్చాడు డైరెక్టర్. కంగువాతో సూర్యకు ఖంగుతినిపించిన శివ.. గోపీచంద్‌కు సౌఖ్యం, రవితేజకు దరువు రూపంలో రాడ్ సినిమాలను ఇచ్చాడు. దెయ్యాలతో చెడుగుడు ఆడే రాఘవ లారెన్స్.. డార్లింగ్ ప్రభాస్ ఖాతాలో రెబల్ రూపంలో ఓ డిజాస్టర్ ఇచ్చాడు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గేమ్ ఛేంజర్‌లో శంకర్ మార్క్ మిస్సైందని అంటున్నారు. ఇలా చాలా మంది దర్శకులు టాలీవుడ్ హీరోలను భయపెట్టిన వాళ్లే.. మరీ ఈ జాబితాలోకి ఇంకెంత మంది చేరతారో..? చూడాలి.