kiran Abbavaram : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కిరణ్ అబ్బవరం
- ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్ కానున్న లవ్ రెడ్డి
- అంజన్ రామచంద్ర
- శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా వస్తున్న లవ్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “లవ్ రెడ్డి” . అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి “లవ్ రెడ్డి” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా “లవ్ రెడ్డి” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. “లవ్ రెడ్డి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
Also Read : Allu Arjun: కళ్ళు చెదిరే రేట్ కు పుష్ప – 2 ఉత్తరాంధ్ర రైట్స్..?
Also Read
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ” ఒక ఫ్యామిలీ కష్టపడి చేసిన సినిమా కాబట్టి మీరంతా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడండి. కంటెంట్ నచ్చితే లవ్ రెడ్డి సినిమాను హార్ట్ ఫుల్ గా సపోర్ట్ చేయండి. నా వల్ల అయిన హెల్ప్ నేను చేస్తా. ఆంధ్ర, సీడెడ్, నైజాంలో ఒక్కో షో నేను స్పాన్సర్ చేస్తాను” అని మాట ఇచ్చాడు. నేడు ఆ మాటను నిజం చేస్తూ నైజాం లో GPR ముల్టీప్లెక్స్ లో నేడు సాయంత్రం 7.45 షో, వైజాగ్ – శ్రీ రామా థియేటర్ 6: 30 షో, తిరుపతి – కృష్ణ తేజ 6: 30 షో, విజయవాడ 6:30 షో ప్రేక్షకుల కోసం ఉచితంగా ఏర్పాటు చేసారు. ఇచ్చిన మాట నిలబెట్టుక్కున్నా యంగ్ హీరోను నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కొనియాడుతున్నారు.
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు.. అది అంటేనే చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుంది..!
-
Lucknow: ఏడాది క్రితమే పెళ్లి.. ఇప్పుడు భార్యకు ప్రియుడితో మరో పెళ్లి.!
-
Modi-Xi Jinping Meeting: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారి భారత్‌కు జిన్‌పింగ్.. మోడీ-చైనా అధ్యక్షుడి భేటీపై ఉత్కంఠ
-
Vrushakarma Release Update: ‘వృషకర్మ’ కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
-
Hyundai Lounge Edition: మూడు Hyundai SUVలకు కొత్త లుక్, కొత్త ఫీచర్లు.. Lounge Edition లాంచ్, ధరలు ఇవే
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?