ప్రముఖ కన్నడ నటుడు యశ్ ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అతనితో సినిమాలు చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే కన్నడ చిత్రం ‘ముఫ్తీ’ ఫేమ్ నార్తన్ తో యశ్ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త కొంతకాలంగా శాండిల్ వుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఆ విషయాన్ని నార్తన్ సైతం కన్ ఫామ్ చేశాడు. రెండేళ్ళుగా యశ్ తో తాను ట్రావెల్ చేస్తున్నానని, తాను చెప్పిన లైన్ నచ్చి యశ్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిపాడు. ఇప్పుడు పర్ ఫెక్ట్ గా స్టోరీ రెడీ అయ్యిందని, యశ్ కు ఫైనల్ వర్షన్ వినిపించడమే తరువాయి అని నార్తన్ ఆ ముఖాముఖీలో స్పష్టం చేశాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే, ‘కేజీఎఫ్ -2’ తర్వాత పట్టాలెక్కే కొత్త సినిమా తనదే అన్నట్టుగానే నార్తన్ చెబుతున్నాడు.
Read More: సంతోష్ శోభన్ తో చిరంజీవి డాటర్ మూవీ!
ఆర్మీ నేపథ్యంలో రూపుదిద్దుకునే ఈ చిత్రంలో యశ్ ఆర్మీ ఆఫీసర్ గా నటించబోతున్నాడని, హీరోయిన్ గా తమన్నాను ఎంపిక చేశారని వార్తలు వచ్చాయి. ఎందుకంటే… ఇప్పటికే యశ్ ‘కేజీఎఫ్’లో తమన్నా స్పెషల్ సాంగ్ లో నర్తించింది. దాంతో ఈ వార్తల్లో నిజం ఉందనే అంతా అనుకుంటున్నారు. కానీ యశ్ టీమ్ మాత్రం ఇందుకు భిన్నంగా మాట్లాడుతోంది. నార్తన్ తో యశ్ సినిమా చేయబోతున్న మాట వాస్తవమే అని, కాకపోతే అందులో యశ్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడని, తమన్నాను హీరోయిన్ గా ఎంచుకున్నారని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెబుతున్నారు. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే… యశ్ లేదా తమన్నా నోరు విప్పాల్సిందే!