అనుకున్నట్టే అయ్యింది… మరో పాన్ ఇండియా మూవీ విడుదల వచ్చే యేడాదికి వాయిదా పడింది. ఇప్పటికే ‘ట్రిపుల్ ఆర్’ మూవీ ఈ దసరాకు కాకుండా… వచ్చే యేడాది జనవరి 26న విడుదల కాబోతోందనే ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో కన్నడ స్టార్ యశ్ నటించిన ‘కేజీఎఫ్ -2’ మూవీని వచ్చే యేడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ హంబలే ఫిలిమ్స్ తెలిపింది. ఈ విషయాన్ని హీరో యశ్ సైతం ధ్రువీకరించాడు. కన్నడ సంవత్సరాది…
ప్రముఖ కన్నడ నటుడు యశ్ ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అతనితో సినిమాలు చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే కన్నడ చిత్రం ‘ముఫ్తీ’ ఫేమ్ నార్తన్ తో యశ్ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త కొంతకాలంగా శాండిల్ వుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఆ విషయాన్ని నార్తన్ సైతం కన్ ఫామ్ చేశాడు. రెండేళ్ళుగా యశ్ తో తాను ట్రావెల్ చేస్తున్నానని, తాను చెప్పిన లైన్ నచ్చి…