కాయాదు లోహర్.. అంటే ఎవర్రా అనుకున్నారు మన కుర్రాళ్లు మొన్నటిదాకా. ఎందుకంటే ఆమె తెలుగులో ఇప్పటికే అల్లూరి అనే ఒక సినిమా చేసినా ఆ సినిమా వర్క్ అవుట్ కాకపోవడంతో ఆమెకు ఆశించిన గుర్తింపు అయితే దక్కలేదు. కానీ ఈ మధ్య ఆమె ప్రదీప్ రంగనాధన్ హీరోగా నటించిన డ్రాగన్ అనే సినిమాలో హీరోయిన్ గా మెరిసింది. ఆమె ఈ సినిమాలో అనుపమతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే అనుపమ కోసం ప్రిపేర్ అయి సినిమా థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు ఈమె అవుట్ ఆఫ్ ది సిలబస్ లా వచ్చింది. ఒకరకంగా తమిళ తంబీలు అయితే ఆమె అందానికి దాసోహం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Hari Hara Veera Mallu: ‘కొల్లగొట్టినాదిరో’ అంటున్న ‘హరి హర వీరమల్లు’!
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె ఫొటోలే, ఆమె వీడియోలే. ఇంత అందాన్ని ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాం రా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అదలా ఉంచితే ఇప్పుడు కాయాదు తెలుగులో ఒక మంచి ఆఫర్ పట్టేసింది. విశ్వక్ సేన్ హీరోగా ఫంకీ అనే సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమాలో హీరోయిన్ గా ఆమెను సంప్రదించగా ఆమె అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అలా మొత్తం మీద దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తోందీ అస్సామీ భామ.