సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య డీప్ ఫేక్ వీడియోలు సంచలనంగా మారాయి.. స్టార్ హీరోయిన్లను టార్గెట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లను టార్గెట్ చేశారు కేటుగాళ్లు.. హీరోయిన్ల ఫేస్ లు, బాడీలు మార్చేసి.. హాట్ గా చూపిస్తూ వీడియోలను సోషల్ మీడియాలో వదులుతున్నారు.. ఆ వీడియోలు ఎంత హాట్ టాపిక్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.. ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
బాలివుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించంది.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది.. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.. ప్రస్తుతం సినిమాలను తగ్గించింది. తన సైన్ చేసిన సినిమాల్లో మాత్రం నటిస్తూ వస్తోంది. చివరిగా ఈ ముద్దుగుమ్మ ‘టైగర్ 3’ చిత్రంతో అలరించింది.. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తుంది..
ఇకపోతే ఈ అమ్మడు డీప్ ఫేక్ వీడియో ఒకటి గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అందులో అస్లీలంగా ఏమీ లేకపోయినా.. ఆమెది కాని వాయిస్ ను ఆడ్ చేసి.. సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అందులో ఆమె అనర్గళంగా టర్కిష్ మాట్లాడుతూ కనిపించింది. నిజానికి ఈ వీడియో 2014లో హృతిక్ రోషన్, కత్రినా కలిసి నటించిన బ్యాంగ్ బ్యాంగ్ మూవీని ప్రమోట్ చేస్తున్నప్పుడు ఓ ఇంటర్వ్యూలోనిది వీడియో అది.. కత్రినా టర్కిష్ మాట్లాడుతున్నట్లు డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో ఆమె ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.. నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..