బాలీవుడ్ లో వేగంగా దూసుకుపోతోన్న యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్. ఇప్పుడు ఈ టాలెంటెడ్ యాక్టర్ డైరెక్టర్ హన్సల్ మెహతాతో చేతులు కలిపినట్లు సమాచారం. ‘స్కామ్ 1992’తో పెద్ద సంచలనం సృష్టించాడు డైరెక్టర్ మెహతా. ఇంతకు ముందు కూడా ‘షాహిద్, అలీఘర్’ లాంటి అక్లెయిమ్డ్ మూవీస్ అందించాడు ఆయన. అటువంటి డిఫరెంట్ డైరెక్టర్ తొలిసారి ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ స్టార్ కార్తీక్ ఆర్యన్ తో జతకడుతున్నాడు!
హన్సల్ మెహతా సినిమాలో కార్తీక్ క్యారెక్టర్ ఐఏఎఫ్ అధికారి అంటున్నారు. గతంలో మాధవన్, షారుఖ్ ఖాన్ లాంటి వారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అఫీసర్స్ గా తెరపై కనిపించారు. రీసెంట్ గా ‘గుంజన్’ మూవీలో జాన్వీ కపూర్ కూడా పైలెట్ గా అలరించింది. మరి కార్తీక్ ఆర్యన్ ని హన్సల్ మెహతా ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ లో ఎలా చూపిస్తాడో?
కార్తీక్ నిజానికి కరణ్ జోహర్ మూవీ ‘దోస్తానా 2’ పూర్తి చేయాల్సి ఉంది. కానీ, క్రియేటివ్ కారణాల వల్ల ధర్మ ప్రొడక్షన్స్ యంగ్ హీరోని ప్రాజెక్ట్ నుంచి తప్పించింది. ఇది చాలా మందిని షాక్ కి గురి చేసింది. అసలు కారణం ఏంటో ఎవరికీ తెలియదుగానీ పుకార్లైతే జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ‘దోస్తానా 2’ చేతిలోంచి జారిపోవటం వల్ల కార్తీక్ కి వచ్చిన నష్టమైతే ఏం లేదనే చెప్పాలి. ఆయన టీ-సిరీస్ బ్యానర్ వస్తోన్న ‘భూల్ భులయ్యా 2’తో బిజీగా ఉన్నాడు. అక్షయ్ కుమార్, విద్యా బాలన్ స్టారర్ ఒరిజినల్ ‘భూల్ భులయ్యా’కి ఇది సీక్వెల్. కార్తీక్ సరసన కియారా హీరోయిన్ గా నటిస్తుండగా టబు కీలక పాత్రలో థిల్ చేయనుంది!