టాలీవుడ్ స్టార్ హీరో కార్తీ కి తెలుగులో కూడా ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. అనతి కాలంలోనే మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. ఇక కార్తి భారీ హిట్ లలో ‘సర్దార్’ ఒకటి. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం 2022లో విడుదలై థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. రూ.100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. అయితే దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ ఉంటుందని మేకర్స్ అప్పుడే ప్రకటించారు. ఇక గత ఏడాది హీరో కార్తీ పుట్టిన రోజు మే25న ఈ మూవీ షూటింగ్ ప్రారంభించారు..
ఇందులో అషికా రంగనాథ్ , మాళవిక మోహనన్ , రాజీశ విజయన్ హీరోయిన్ లుగా నటిస్తుండగా, ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తుండగా సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇక తాజాగా ఈ ఏడాది మే25న కార్తి బర్త్ డే కానుకగా ఈ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేయగా.. రీసెంట్‌గా ఈ మూవీ రిలీజ్ పై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ‘సర్దార్ 2’ ఈ ఏడాదిలో అయితే రాదట. వచ్చే ఏడాది పొంగల్ రేస్ లో మేకర్స్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్‌కి సిద్ధం చేసుకుంటున్నారని టాక్. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.