విష్ణు మంచు ప్రధాన పాత్రలో రూపొందిన డివోషనల్ డ్రామా ‘కన్నప్ప’. తాజాగా థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, విష్ణు కెరీర్‌లో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్‌గా నిలిచింది. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి టాక్‌ను అందుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో విష్ణు నటనకు ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు.
ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ‘కన్నప్ప’ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంపాదించిందని సమాచారం. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను జూలై 25 నుంచి స్ట్రీమింగ్ చేసేందుకు ప్రైమ్ వీడియో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను స్ట్రీమ్ చేయాలని ప్రైమ్ వీడియో సిద్ధమవుతోంది. అయితే ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. దీంతో సినిమా అభిమానుల్లో ఓటీటీ రిలీజ్‌పై మరింత ఉత్కంఠ నెలకొంది.