విష్ణు మంచు నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం “కన్నప్ప”కు సంబంధించిన కీలకమైన హార్డ్ డిస్క్ మాయమైన ఘటన సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఫైల్స్ ఉన్న హార్డ్ డ్రైవ్ హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్లో మిస్సింగ్ అయినట్లు నిర్మాతలు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదై, విచారణ కొనసాగుతోంది. ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్ నుంచి కన్నప్ప సినిమా యొక్క కీలక విఎఫ్ఎక్స్ కంటెంట్‌ను కలిగి ఉన్న హార్డ్ డ్రైవ్‌ను హైదరాబాద్‌లోని ఫోర్ ఫ్రేమ్స్ పోస్ట్-ప్రొడక్షన్ హౌస్‌కు డీటీడీసీ కొరియర్ ద్వారా మార్చి మొదటి వారంలో పంపించారు. ఈ పార్సిల్ ఫిల్మ్ నగర్‌లోని ఆఫీసులో డెలివరీ అయినట్లు కొరియర్ సంస్థ రికార్డులు చెబుతున్నాయి.
Also Read:ఆమ్మో.. అనసూయా.. ఏంటీ అరాచకం?
ఈ పార్సిల్‌ను ఆఫీస్ బాయ్ రఘు స్వీకరించినట్లు తెలుస్తోంది. అయితే, రఘు ఈ హార్డ్ డ్రైవ్‌ను చరిత అనే మహిళకు అప్పగించినట్లు చెప్పాడు. ఆ తర్వాత రఘు, చరిత ఇద్దరూ పరారీలో ఉన్నారని, హార్డ్ డ్రైవ్ కూడా మాయమైందని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. తాను ఎలాంటి డ్రైవ్ తీసుకోలేదని రఘు నిర్మాణ సంస్థకు తెలిపినట్టు తెలుస్తోంది. డ్రైవ్ మిస్ అయితే కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని పోలీసులకు తెలిపింది నిర్మాణ సంస్థ. .సినిమా విడుదల కంటే ముందు ఏదైనా బయటికి వస్తే పెద్ద నష్టం వాటిల్లుతుందని తెలిపిన నిర్మాతతో పాటు పలువురి దగ్గర నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు పోలీసులు. ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రెడ్డి విజయ్ కుమార్ ఈ ఘటనపై ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Also Read:Kamal : కమల్ “తగ్ లైఫ్” బ్యాన్.. కన్నడ సంఘాల ఫైర్.. అసలు ఏంటీ గొడవ?
హార్డ్ డ్రైవ్‌లో సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన 90 నిమిషాల విఎఫ్ఎక్స్ ఫుటేజ్ ఉందని, ఇది బయటకు లీక్ అయితే లేదా నాశనమైతే కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సినిమా విడుదలకు కేవలం నెల రోజులు మాత్రమే ఉండగా, ఈ ఘటన సినిమా ప్రమోషన్లపై తీవ్ర ప్రభావం చూపవచ్చని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హార్డ్ డ్రైవ్ మాయం వెనుక ఉద్దేశపూర్వక కుట్ర ఉందని, సినిమాను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా ఫిల్మ్ నగర్ పోలీసులు రఘు, చరితలపై నమ్మకద్రోహం (సెక్షన్ 316(2) ఆఫ్ బీఎన్ఎస్) కింద కేసు నమోదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ, పరారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిర్మాతలతో పాటు సంబంధిత వ్యక్తుల నుంచి స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తూ విచారణ కొనసాగిస్తున్నారు.