బాలీవుడ్ క్వీన్ కంగనా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే మూవీస్ విషయంలో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో.. వ్యక్తిగతంగా కూడా అంతే నిజాయితీగా ఉంటుంది. ఎలాంటి విషయం అయినా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఎదుటి వ్యక్తి ఎంత పెద్ద స్థాయిలో ఉన్న కూడా భయపడకుండా సమాధానం ఇస్తుంది. అందుకే చాలా వరకు కంగనా తన మాటలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే ఇండస్ట్రీలో వయసుకు సంబంధించిన టాపిక్ ఏదోరకంగా నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్ విషయంలో ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. అయితే తాజాగా ఈ విషయం పై కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది..
Also Read : Disha Patani: హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోన్న కల్కి బ్యూటీ
‘నా మనసు ఎప్పుడు కూడా వయసు గురించి భయపడలేదు. కానీ నా చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులు తెల్లజుట్టు చూడగానే.. భయపడిపోయి, కలర్ స్ప్రేలు ఉపయోగిస్తారు. ఈ వయసు ప్రభావం లేని ప్రదేశంలో ఉండటం సంతోషంగా ఉంది. వయసు పెరగడం కూడా ఓ ఆనందమే. సినిమా పరిశ్రమలో కంటే రాజకీయాలు వృద్ధ మహిళ పట్ల దయతో ఉంటాయని అనుకుంటున్నారా..? నా సమాధానమైతే అవుననే అంటాను’ అంటూ ఇన్స్టా స్టోరీ లో ఒక పోస్టు పెట్టింది. అలాగే ఎలాంటి అలంకరణ లేకుండా దిగిన ఫొటోలను షేర్ చేస్తారు.