మనీ లేక ‘మణికర్ణిక’ తంటాలు… కంగనాకు తప్పని కరోనా కష్టాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంగనాకి కూడా కరెన్సీ కష్టాలు తప్పటం లేదు! కారణం అంటారా… ఏముంది, కరోనా మహమ్మారే! ఈ మద్యే ఆమెకు వైరస్ సోకింది. త్వరగానే బయటపడింది మన స్ట్రాంగ్ లేడీ. అయితే, బాలీవుడ్ ‘క్వీన్’కి కరోనా వల్ల ఆరోగ్య సమస్యలే కాదు ఆర్దిక సమస్యలు కూడా తప్పటం లేదట. పోయిన సంవత్సరం ట్యాక్స్ కూడా తాను ఇంత వరకూ పూర్తిగా పే చేయలేదని ప్రకటించింది బీ-టౌన్ ‘తలైవి’! కంగనా ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న యాక్టర్. ఆమెతో సినిమా తీసేందుకు చాలా మంది ఇంట్రస్ట్ చూపుతుంటారు. అంతే కాదు, కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటోంది కంగనా. అయితే, బీ-టౌన్ బ్యూటీస్ లో వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ గా ఉన్న ఆమె దాదాపు 45 శాతం వరకూ తన ఆదాయంలో ట్యాక్స్ గానే కట్టాలట.
2020లో పెద్దగా షూటింగ్ లు లేకపోవటంతో రాబడి తగ్గింది అంటోంది ‘ఏక్ నిరంజన్’ సుందరి. దాంతో ఈ సంవత్సరం కూడా మళ్లీ లాక్ డౌన్ నేపథ్యంలో ట్యాక్స్ చెల్లించటం ఇబ్బందిగా మారిందట. మరో ట్విస్ట్ ఏంటంటే… గవర్నమెంట్ తాను కట్టని ట్యాక్స్ పై వడ్డీ కూడా వేస్తోందని కంగనా తెలిపింది! కానీ, ప్రభుత్వానికి, దేశానికి చెల్లించే సొమ్ము విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఆమె ముక్తాయింపునిచ్చింది…మనసులో ఏది ఉంటే అదే మాట్లాడే తత్వం కంగనాది. కాబట్టి ఆమె ట్యాక్స్ కష్టాల విషయంలో నిజమే చెబుతోందని భావించవచ్చు. కాకపోతే, ప్రస్తుతం ‘తలైవి’ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తోన్న కంగనా నెక్ట్స్ ‘తేజస్, దక్కడ్, మణికర్ణిక రిటర్న్స్’ వంటి క్రేజీ సినిమాలతో హల్ చల్ చేయబోతోంది. మరి అప్పుడు మన ‘మణికర్ణిక’కి మనీ కష్టాలు ఉంటాయా? అఫ్ కోర్స్, ఉండకపోవచ్చు…
Also Read
తాజావార్తలు
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్‌పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!