KALKI2898AD : 50 రోజులు కంప్లిట్ చేసుకున్న రెబల్ స్టార్ కల్కి..
- ప్రభాస్ - నాగ్ అశ్విన్ ల లేటెస్ట్ సెన్సేషన్ కల్కి
- 50 రోజుల థియేటర్ రన్ పూర్తి చేసుకున్న కల్కి
- పార్ట్ -2పై త్వరలోనే అధికారక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 27న రిలీజ్ అయి మొదటి రోజూ నుంచి వసూళ్లలో దూసుకు పోతూనే ఉంది. ఇక బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ రూ.1100కోట్ల గ్రాస్ రాబట్టింది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ ఫీటును సాధించిన చిత్రంగా కల్కి నిలిచింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె, కమల్‌హాసన్, మృణాల్ ఠాకూర్, మాళవిక మోహన్ , రాజమౌళి, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ముఖ్య పాత్రల్లో మెరిశారు. మహాభారతం ఇతిహాసంతో అత్యంత భారీ బడ్జెట్‌పై వైజయంతీ బ్యానర్ లో అశ్విన్ దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Also Read : Mrunal Thakur: ప్రభాస్ సినిమాకు నో చెప్పిన మృణాల్.. కారణం ఇదే.?
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన 'సీక్రెట్ సోల్జర్'
కాగా నేటితో కల్కి థియేటర్లలో రిలీజ్ అయి 50 రోజులు పూర్తయింది. దీంతో చిత్ర బృందం ఓ ప్రత్యేక పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇంతటి భారీ విజయాన్ని అందించినందుకు అందరికి ధన్యవాదాలు నిర్మాణ సంస్థ తెలిపింది. థియేటర్లో సూపర్ డూపర్ హిట్ సాధించిన ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు.ఈ ఆగస్టు 23 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. దీని హిందీ వెర్షన్ మాత్రం అదే తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో ముందునుంచీ భైరవగా సందడి చేసిన ప్రభాస్.. చివరిలో కర్ణుడిగా కనిపించి ‘పార్ట్ 2’పై అందరిలోనూ ఆసక్తి పెంచేశాడు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!