Kalki 2898 AD Grosses 625 Crores plus Worldwide In 5 Days: ప్రభాస్ కీలక పాత్రధారిగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ఇతర ముఖ్య పాత్రలలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి 2898 AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద అశ్వని దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో 625 కోట్లకు పైగా వసూళ్లుసాధించింది. బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని విధంగా ఈ సినిమా దూసుకు పోతూ రిలీజ్ అయిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రికార్డులు బద్దలు కొడుతూ దూసుకు పోతోంది. ఈ సినిమా ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 625 కోట్ల గ్రాస్‌ను దాటింది. సోమవారం నాడు అంటే వర్కింగ్ డే రోజు ప్రపంచవ్యాప్తంగా 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా మొత్తం ఐదు రోజులకు 625 కోట్లకు పైగా వసూలు చేసింది.
Revanth Reddy: డ్రగ్స్ పై యుద్ధం.. సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కండిషన్స్ ?
తెలుగు, హిందీ వెర్షన్లు రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తుండగా, ఇతర భాషల్లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. హిందీలో, ఈ చిత్రం సోమవారం 20 కోట్లకు పైగా వసూలు చేసింది. ఉత్తర భారతదేశంలో (హిందీ వెర్షన్ మాత్రమే) ఇప్పటి వరకు మొత్తం 135 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో మరో ఘనత సాధించింది. కల్కి 2898 AD ఉత్తర అమెరికాలో $12 మిలియన్లను అధిగమించింది. ఈ ప్రాంతంలో అత్యంత వేగంగా 100 కోట్ల గ్రాస్‌ను నమోదు చేసిన భారతీయ చిత్రం ఇదేనని చెబుతున్నారు అనలిస్టులు. పాజిటివ్ టాక్‌తో, భారతదేశంలో అత్యంత ఖరీదైన చిత్రంగా నిలిచిన కల్కి 2898 AD 1000 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించడానికి రెడీ అవుతోంది. ఈ వీకెండ్ వచ్చేలోపే ఈ సినిమా ఆ మార్క్ చేరుకునే అవకాశం ఉంది.