జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం వార్ 2. యశ్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఇప్పటికే వార్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అయింది. హృతిక్ రోషన్, టైగర్ షరాఫ్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకి సీక్వెల్‌గా ఇప్పుడు వార్ 2 తెరకెక్కించారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో జూనియర్ ఎన్టీఆర్ పోరాడబోతున్నాడు. ఇప్పటికే సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది సినిమా యూనిట్. రిలీజ్‌కి ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండగా, ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఈవెంట్ నిర్వహించబోతున్న శ్రేయస్ మీడియా ఒక హింట్ ఇచ్చింది.
ALso Read:వీరమల్లు భామ కొత్త అందాలు
ఏ రోజు, ఎక్కడ అనే విషయాలు వెల్లడించలేదు కానీ, ఈ నెల 10వ తేదీన నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అయితే, గతంలో దేవర సినిమా ఈవెంట్ కూడా శ్రేయస్ మీడియా నిర్వహించలేక చేతులెత్తేసిన నేపథ్యంలో ఆ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. కాబట్టి ఈసారి అలాంటి తప్పిదాలు ఏమీ జరగకుండా ముందు నుంచే గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు, పుష్ప తొక్కిసలాట ఘటన తర్వాత ఇలాంటి ఈవెంట్స్‌కి పర్మిషన్స్ ఇచ్చేందుకు పోలీసులు వెనకాడుతున్నారు. దాదాపు శిల్పకళావేదిక అయితే క్లోజ్డ్ ఆడిటోరియం కాబట్టి కాస్త కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. శిల్పకళావేదికలోనే ఈవెంట్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఈవెంట్‌కి జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు హృతిక్ రోషన్ కూడా హాజరు కాబోతున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ కట్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు, కానీ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తూ ఉండడంతో సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.