76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన 139 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. అందులో తెలుగు వారికి ఏడు అవార్డులు దక్కాయి. తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఐదుగురు ఉన్నారు. కళా రంగంలో గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ కు పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. సినీ రంగంలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు రావడంతో అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.
ఈ సందర్భంగా బాలయ్య కు అభినందనలు తెలుపుతూ అబ్బాయిలు జూనియర్ ఎన్టీఆర్ అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ లు విషెస్ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ” భారతదేశ మూడవ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించబడిన నా బాల బాబాయ్‌కి నా హృదయపూర్వక అభినందనలు. మీరు సినిమా రంగానికి చేస్తున్నవిశేష కృషి, అవిశ్రాంత ప్రజా సేవకు ఈ గుర్తింపు ఓ నిదర్శనంబాబాయ్’ అని పోస్ట్ చేసాడు
ఇక నందమురి కళ్యాణ్ రామ్ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ‘పద్మభూషణ్ అవార్డు అందుకున్న మా బాబాయ్ బాలకృష్ణకు అభినందనలు. ఈ పురస్కారం సినిమా ప్రపంచానికి మీరు చేసిన విశేషమైన సేవలకు మరియు సమాజానికి సేవ చేయడంలో మీ నిర్విరామ కృషికి నిజమైన గుర్తింపు బాబాయ్’ అని పోస్ట్ చేసాడు.
ఇలా అబ్బాయిలిద్దరు బాల బాబాయ్ కి విషెస్ తెలుపుతూ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాను షేక్ చెసాయి. బాబాయ్ – అబ్బాయిలు మధ్య ప్రేమాను రాగాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం అని నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ చేసిన ట్వీట్స్ ను షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Heartiest congratulations to Bala Babai on being honored with the prestigious Padma Bhushan award. This recognition is a testament to your unparalleled contributions to cinema and your relentless public service.
— Jr NTR (@tarak9999) January 25, 2025
Heartfelt congratulations to my Babai Nandamuri Balakrishna garu on receiving the prestigious Padma Bhushan award. This honor is a true recognition of your exceptional contributions to the world of cinema and your relentless efforts in serving society.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) January 25, 2025