యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో ఏది వంక పెట్టలేం. ఇప్పుడున్న స్టార్ హీరోలలో నటన పరంగా ఎన్టీఆర్‌ను కొట్టేవాడే లేడు. కానీ ఒక్కోసారి ఎన్టీఆర్ చేసే యాడ్స్ మాత్రం.. ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోయేలా చేస్తుంటాయి. కమర్షియల్‌గా చూస్తే ఎన్టీఆర్ ఎన్నో యాడ్స్ చేశాడు. కానీ లేటెస్ట్‌గా వచ్చిన ఒక యాడ్ మాత్రం ట్రోలింగ్‌కు దారి తీసినట్టైంది. తాజాగా ఓ క్విక్ కామర్స్ కంపెనీ యాడ్ చేశాడు యంగ్ టైగర్. అది చూసిన అభిమానులు షాక్ అయ్యారనే చెప్పాలి. యాడ్ కంటెంట్ ఎలా ఉన్నా.. టైగర్ లుక్ సెట్ కాలేదనే కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ షార్ట్ హెయిర్ స్టైల్ దారుణంగా ఉందని అంటున్నారు. అసలు.. టైగర్‌ను ఈ లుక్‌లో ఊహించుకుంటేనే దారుణంగా ఉందని ట్వీట్లు పడుతున్నాయి.
Naga Chaitanya: వెకేషన్లో కొత్త జంట!
ఆ యాడ్ ఏంటో, ఆ హెయిర్ స్టైల్ ఏంటో? అని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇప్పటి వరకు తారక్ చేసిన యాడ్స్‌లలో ఇదే వరస్ట్ లుక్ అని అంటున్నారు. అన్నట్టు.. ఈ యాడ్‌లో నటి విద్యుల్లేఖ రామన్ కూడా మెరిసింది. ఇకపోతే.. యంగ్ టైగర్ ప్రస్తుతం ముంబైలో వార్ 2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ పై అదిరిపోయే సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ పాటను 500 మంది డ్యాన్సర్లతో భారీ ఎత్తున షూట్ చేస్తున్నట్టుగా సమాచారం. ఎన్టీఆర్, హృతిక్ డ్యాన్స్‌కు థియేటర్లు తగలబడిపోవడం గ్యారెంటీ అంటున్నారు. ఈ వారంలోనే షూటింగ్ పూర్తి కానుంది. ఇక ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయనున్నాడు ఎన్టీఆర్. ప్రజెంట్ టైగర్ లేని సీన్స్ షూట్ చేస్తున్నాడు నీల్. మార్చి ఎండింగ్ లేదా ఏప్రిల్‌లో ఎన్టీఆర్ ఈ షూటింగ్‌లో జాయిన్ అవనున్నాడు. ఈ సినిమాల పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.