నాగచైతన్య, శోభిత వివాహం చేసుకుని ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ జంట ఒకటయ్యాక చాలా మంది వీరిద్దరినీ ఆశీర్వదించగా, మరి కొంత మంది విమర్శించారు కూడా. ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా పట్టించుకోకుండా వారి జీవితం వారు సాగిస్తూ కపుల్ గోల్స్ అన్నిటినీ అచీవ్ చేసుకునే పనిలో పడ్డారు. ఈ సంవత్సరం జనవరి నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు తన “తండేల్” సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న నాగ చైతన్య ఇటీవలే సుదీర్ఘ సెలవు తీసుకున్నాడు. ఇప్పుడు చైతూ తన భార్య, నటి శోభిత ధూళిపాళతో కలిసి ఒక ట్రిప్ కి వెళ్ళాడు.
Samantha : టాలీవుడ్ కంబ్యాక్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్
హనీమూన్ కాకుండా వివాహం తర్వాత వారి మొదటి వెకేషన్ ఇదే. వారు డిసెంబర్ 2024 లో వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వెకేషన్ కి వెళ్లడం ఇదే మొదటి సారి. ఇక శోభిత తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా “వైబ్స్” పేరుతో ఈరోజు తన వెకేషన్ ట్రిప్ నుండి ఫోటోలను షేర్ చేసింది. ఆమ్స్టర్డామ్, మెక్సికోలోని అనేక రెస్టారెంట్లలో వారు డిన్నర్ మరియు డెజర్ట్ తింటున్నట్లు ఫొటోలలో కనిపిస్తోంది. ఇక ఈ ఫోటో డంప్ లో స్మూతీలను ఆస్వాదించడం నుండి చిట్టి సమోసాల వరకు వారు ఆస్వాదిస్తూ కనిపిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ జంట హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. నాగ చైతన్య తన తదుపరి సినిమా గురించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.