Site icon NTV Telugu

Hrithik -NTR: చావో రేవో తేలాలిపుడే డ్యాన్స్!

Ntr Hrothik

Ntr Hrothik

జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే తెలుగులో సూపర్ స్టార్‌గా సుపరిచితుడు. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాతో ఆయన హిందీలో సైతం గుర్తింపు సంపాదించాడు. తర్వాత వచ్చిన దేవర రిజల్ట్ పక్కన పెడితే, ఇప్పుడు వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఒక స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Also Read:BV Pattabhiram: ప్రముఖ సైకాలజిస్ట్‌ బీవీ పట్టాభిరామ్‌ గుండెపోటుతో మృతి..

నిజానికి వీరిద్దరూ కలిసి నటిస్తున్నారని ప్రకటన వచ్చినప్పటి నుంచే సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ కలిసి చేసే సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డులు బద్దలు కొడుతుందని మేకర్స్ నమ్ముతున్నారు. వీరిద్దరి క్రేజ్ సంగతి పక్కన పెడితే, వీరిద్దరి డాన్స్‌కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరితో కలిసి ఒక యుద్ధంలాంటి డాన్స్ సీక్వెన్స్ ఒకటి ప్లాన్ చేశారు మేకర్స్. ప్రస్తుతానికి ఈ సాంగ్‌కి సంబంధించిన షూటింగ్ ముంబైలో జరుగుతోంది.

Also Read:Prabhas: ప్రభాస్ కాలికి ‘ఫౌజీ’ షూట్లో గాయం.. అసలేమైందంటే?

ఈ రోజు ఉదయం నుంచే ఈ సాంగ్ షూటింగ్ మొదలైనట్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరూ ఇప్పటికే కొద్ది రోజులుగా రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి ప్రారంభమైన షూటింగ్ కూడా ఆసక్తికరంగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన రజనీకాంత్ కూలీ సినిమాతో పోటీ పడబోతుంది అనడం గమనార్హం.

Exit mobile version