Hrithik -NTR: చావో రేవో తేలాలిపుడే డ్యాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే తెలుగులో సూపర్ స్టార్‌గా సుపరిచితుడు. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాతో ఆయన హిందీలో సైతం గుర్తింపు సంపాదించాడు. తర్వాత వచ్చిన దేవర రిజల్ట్ పక్కన పెడితే, ఇప్పుడు వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఒక స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Also Read:BV Pattabhiram: ప్రముఖ సైకాలజిస్ట్ బీవీ పట్టాభిరామ్ గుండెపోటుతో మృతి..
Also Read
- Venu Swamy : "నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!"!
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
నిజానికి వీరిద్దరూ కలిసి నటిస్తున్నారని ప్రకటన వచ్చినప్పటి నుంచే సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ కలిసి చేసే సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డులు బద్దలు కొడుతుందని మేకర్స్ నమ్ముతున్నారు. వీరిద్దరి క్రేజ్ సంగతి పక్కన పెడితే, వీరిద్దరి డాన్స్‌కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరితో కలిసి ఒక యుద్ధంలాంటి డాన్స్ సీక్వెన్స్ ఒకటి ప్లాన్ చేశారు మేకర్స్. ప్రస్తుతానికి ఈ సాంగ్‌కి సంబంధించిన షూటింగ్ ముంబైలో జరుగుతోంది.
Also Read:Prabhas: ప్రభాస్ కాలికి ‘ఫౌజీ’ షూట్లో గాయం.. అసలేమైందంటే?
ఈ రోజు ఉదయం నుంచే ఈ సాంగ్ షూటింగ్ మొదలైనట్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరూ ఇప్పటికే కొద్ది రోజులుగా రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి ప్రారంభమైన షూటింగ్ కూడా ఆసక్తికరంగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన రజనీకాంత్ కూలీ సినిమాతో పోటీ పడబోతుంది అనడం గమనార్హం.
తాజావార్తలు
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!