Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్‌లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్‌లో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని, సంస్థపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని జానీ మాస్టర్ భార్య, డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత స్పష్టం చేశారు. తాజాగా టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయని, డాన్సర్స్ అసోసియేషన్ (యూనియన్) వేదికగా వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందంటూ నిన్న ఒక వీడియో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై తాజాగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సుమలత మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 35 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అసోసియేషన్‌ను నడిపించడం అంత సులభం కాదని, ఏ విషయం జరిగినా బాధ్యత అధ్యక్షురాలిపైనే ఉంటుందని ఆమె తెలిపారు. అయితే ప్రస్తుతం కార్యవర్గ సభ్యులంతా ఐక్యంగా పనిచేస్తున్నారని, ఎలాంటి ఏకపక్ష నిర్ణయాలు లేదా గొడవలు లేవని పేర్కొన్నారు. మాజీ కార్యవర్గంలో చోటుచేసుకున్న కొన్ని అక్రమాల కారణంగానే ప్రస్తుతం పరిస్థితులు ఏర్పడ్డాయని సుమలత వెల్లడించారు. కొందరు ఇన్చార్జీలు నిర్మాతల నుంచి ఒక మొత్తం తీసుకుని, అసోసియేషన్ రికార్డుల్లో మరో మొత్తం నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం వల్ల డాన్సర్లు ఆర్థికంగా నష్టపోతున్నారని, దానిని ప్రశ్నించిన అనంతరం అసోసియేషన్ నిర్ణయం మేరకు సంబంధిత వ్యక్తులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
Also Read
- Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
- Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
- Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
- Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
అవినీతికి పాల్పడిన ఇద్దరికి మద్దతుగా మరికొందరు రాజీనామా చేశారని, అనంతరం కొత్త ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారని ఆమె చెప్పారు. అయితే జనరల్ బాడీ సమావేశంలో మెజారిటీ సభ్యులు పూర్తి ఎన్నికలకు కాకుండా, రాజీనామా చేసిన స్థానాలకు మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించారని వెల్లడించారు. ఫెడరేషన్ మొత్తం కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించాలని సూచించినప్పటికీ, అలాంటి నిబంధన అసోసియేషన్ బై లాస్లో లేదని సుమలత స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన రహస్య ఓటింగ్‌లో కూడా రాజీనామా చేసిన పదవులకు మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహించాలని సభ్యులు మెజారిటీగా అభిప్రాయపడినట్లు తెలిపారు. తమ పదవీకాలం ఇంకా కొనసాగుతోందని, ఫెడరేషన్‌కు వ్యతిరేకంగా వెళ్లే ఉద్దేశం లేదని, ఫెడరేషన్తో కలిసి పనిచేయడానికే తాము కట్టుబడి ఉన్నామని సుమలత పేర్కొన్నారు.
తాజావార్తలు
-
China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
-
Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
-
Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
ట్రెండింగ్
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!