Dharma Mahesh : జిస్మత్ మరో బ్రాంచ్ ప్రారంభించిన ధర్మ మహేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ నటుడు మరియు రెస్టారెంట్ అధినేత ధర్మ మహేష్ ఆహార రంగంలో మరో ముందడుగు వేశారు. హైదరాబాద్‌లోని చైతన్యపురిలో తమ రెండవ బ్రాంచ్‌ను ప్రారంభించిన సందర్భంగా, ఆయన తమ బ్రాండ్‌ను ‘గిస్మత్ మండీ’ (Gismat Mandi) నుండి ‘జిస్మత్ మండీ’ (Jismat Mandi) గా రీబ్రాండింగ్ చేసినట్లు ప్రకటించారు. భోజన ప్రియులకు నాణ్యతతో కూడిన, నోరూరించే వంటకాలను అందుబాటులోకి తీసుకురావడం తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. ధర్మ మహేష్ మాట్లాడుతూ, తమ కుమారుడు జగద్వాజ పై ఉన్న ప్రేమతోనే ఈ పేరు మార్పు చేసినట్లు తెలిపారు. ‘Gismat’ నుంచి ‘Jismat’ గా మారిన ఈ పరివర్తన నాణ్యత, భావోద్వేగం మరియు వారసత్వం ద్వారా ప్రేరణ పొందిన కొత్త దశను సూచిస్తుందని ఆయన అన్నారు. ఈ రీబ్రాండింగ్ వెనుక ఉన్న భావోద్వేగ కారణాన్ని ధర్మ మహేష్ వివరించారు.
నేను కంపెనీ యాజమాన్యాన్ని నా కుమారుడు జగద్వజకు అంకితం చేస్తున్నాను. ఆ పరివర్తన పూర్తయ్యే వరకు, నేను కార్యకలాపాలు, విస్తరణను పర్యవేక్షిస్తున్నాను అన్నారు. ఇక్కడ ప్రతి బిర్యానీ ప్లేట్, మా అతిథులకి చిరునవ్వు, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మేము అందించే రుచి, నాణ్యత, ఆప్యాయత ఈ కొత్త గుర్తింపు కింద మరింత బలంగా పెరుగుతాయి. ఈ కొత్త పరిణామం రాబోయే దశాబ్దాల పాటు బ్రాండ్‌ను మరింత బలోపేతం చేస్తుందని ధర్మ మహేష్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!