Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhijeet Dipke: ఢిల్లీలో తిరంగా మార్చ్‌కు ముందు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. అభిజీత్ ఎక్కడ ఉన్నారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ పార్టీ నేతను పోలీసులు అజ్ఞాత ప్రదేశానికి తరలించారని, ఆయనతో ఎలాంటి సంప్రదింపులు కుదరడం లేదని సీజేపీ ఆరోపించింది. అయితే, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలతోనే ఆయనను ప్రివెంటివ్ అరెస్ట్ చేసినట్లు తాజాగా ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అభిజీత్‌ను అదుపులోకి తీసుకునే ముందే ఆయనకు రెండుసార్లు నోటీసులు జారీ చేశామని, సెంట్రల్ పార్క్‌కు వెళ్లవద్దని వారించినా వినకపోవడంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే ఆయనను స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని వెల్లడించారు. గతంలోనూ ప్రివెంటివ్ అరెస్ట్ సమయంలో అభిజీత్ నుంచి రూ. 50 వేల పూచీకత్తు రాయించుకున్నామని, ఏడాదిపాటు శాంతిభద్రతలకు భంగం కలిగించబోనని ఇచ్చిన హామీని ఆయన ఉల్లంఘించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోలేదని పేర్కొన్నారు.
ఈ పరిణామాల మధ్యే, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) అధ్యక్షురాలు నేహా బోరాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. మండి హౌస్ వద్ద అదుపులోకి తీసుకున్న నేహాను ఆర్కేపురం పోలీస్ స్టేషన్‌కు తరలించగా, అర్ధరాత్రి దాటిన తర్వాత లాయర్లు ఆమెను కలిశారు. అయితే, నేహాను సుమారు ఐదు గంటల పాటు నగరంలో పలు ప్రాంతాలకు తిప్పారని, ఆరోగ్యం బాగలేకపోయినా మందులు కూడా ఇవ్వలేదని AISA తీవ్ర ఆరోపణలు చేసింది. అటు వైపు నుంచి వస్తున్న ఆరోపణలు ఉద్రిక్తతకు దారితీయగా, చివరకు పోలీసులు నేహా బోరాను విడుదల చేశారు. ఇక, అభిజీత్ దిప్కే ఆచూకీ తెలపాలంటూ సీజేపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. జాతీయ జెండా పట్టుకుని తిరగడం నేరమెలా అవుతుందని ప్రశ్నించారు. పోలీసుల చర్యలతో ప్రజలు ప్రదర్శనల నుంచి వెనక్కి తగ్గరని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సీజేపీ నేత రోహన్ దేశ్‌పాండే మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఐకి లేఖ రాస్తూ.. అభిజీత్ ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారు? ఏ చట్టాల ప్రకారం అదుపులోకి తీసుకున్నారు? ఎవరి ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు? అనే వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. వకీళ్లతో పాటు సహచరులను కూడా కలవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు.
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
తాజావార్తలు
-
Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!