ఫ్రాన్స్ వేదికగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతున్న విషయం తెలిసిందే. మే 13న ప్రారంభమైన ఈ ఈవెంట్ లో ఐశ్వర్య రాయ్, ఊర్వశి రౌతెలా, దిశా మదన్ తదితర భారతీయ ముద్దుగుమ్మలు తళుక్కుమన్నారు. రెడ్ కార్పెట్ పై నడిచి కెమెరాలకు పోజులిచ్చారు. ఈసారి తాజాగా బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ కూడా మొదటి సారిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైంది. ఈ సందదర్భంగా లేత గులాబీ పొడవాటి గౌన్‌ను ధరించిన ఆమె, రెడ్ కార్పెట్‌పై హొయలొలికించింది. తన స్టైలిష్ అండ్ ట్రెడిషనల్ లుక్ తో తన తల్లి శ్రీదేవిని గుర్తుచేసింది. అయితే కేన్స్ లో అడుగు పెట్టడం గురించి తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు తల్లిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయింది..
Also Read : Srinivasan : నేను నెపో కిడ్‌ని మాత్రం అసలు కాను..
జాన్వీ మాట్లాడుతూ.. ‘హాలీడే ఎంజాయ్ చేయడానికి అమ్మ తరచూ మిమ్మల్ని ఇక్కడికి తీసుకువస్తుండేది. అమ్మకు కేన్స్ అంటే ఎంతో ఇష్టం. నాకు గుర్తున్నంతవరకు వరుసగా నాలుగు సంవత్సరాలపాటు వేసవి సెలవులకు ఇక్కడికే వచ్చాం. ఈరోజు నేను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తొలిసారి పాల్గొనడం నా కుటుంయీనికి ఎంతో ప్రత్యేకమైన విషయం. నటిగా అమ్మ ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది. ఆమెకు సంబంధించిన ప్రతి కార్యక్రమానికి నన్ను తీసుకువెళ్ళింది. ఆమె విజయాలను కుటుంబమంతా సెలబ్రేట్ చేసుకునే వాళ్లం. ఆ రోజులు మాకెప్పటికీ గుర్తుంటాయి. అలాంటిది ఈరోజు మేమంతా మళ్ళీ కేన్స్ లోకి అడుగు పెట్టాం.. నాతోపాటు నాన్న, చెల్లి కూడా వచ్చారు. అమ్మ లేకుండా ఇక్కడికి రావడం నాకెంతో బాధగా ఉంది. ఆమెను నేనెంతో మిస్ అవుతున్నాను’ అని జాన్వీ కపూర్ తెలిపింది.