విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి.
Game Changer: ‘గేమ్ చేంజర్’పై 45 మంది కుట్ర…విడుదలకు ముందు నుంచే బెదిరింపులు !
ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది. జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకి మంచి అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ సినిమాకి 401 ఒక్క షోస్ ఇస్తే ఆ 401 షోస్ కూడా హౌస్ ఫుల్ అవ్వడం గమనార్హం. ఇక ఇప్పటివరకు చూస్తున్న అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్స్ చూస్తుంటే ఇది వెంకటేష్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఫిలిం గా నిలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.