కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి, తన భార్య ఆర్తితో విడాకుల వ్యవహారం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. గత ఏడాది (2024)లో వీరి విడాకుల ప్రకటనతో మొదలైన ఈ వివాదం, సోషల్ మీడియా వేదికగా రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా, చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో జరిగిన విచారణలో ఆర్తి నెలవారీ భరణంగా రూ. 40 లక్షలు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశం ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో, రవి మోహన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక సంచలన పోస్ట్ వైరల్ అవుతోంది.
Also Read:A22 x A6: హైదరాబాద్ చేరుకున్న అట్లీ.. ఐకాన్‌స్టార్‌తో ప్రీ-ప్రొడక్షన్ డిస్కషన్స్
2009లో వివాహబంధంతో ఒక్కటైన రవి మోహన్, ఆర్తి దంపతులు, 15 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2024లో విడిపోతున్నట్లు రవి ప్రకటించారు. అయితే, ఈ ప్రకటన తన సమ్మతి లేకుండా జరిగిందని ఆర్తి ఆరోపించారు. అప్పటి నుంచి ఇరు వర్గాల నుంచి సోషల్ మీడియాలో ఆరోపణలు, ప్రతి ఆరోపణలతో ఈ వివాదం మరింత ఉధృతమైంది. రవి మోహన్ తన భార్య ఆర్తిని ఆర్థికంగా, భావోద్వేగపరంగా ఇబ్బంది పెట్టారని, తన పిల్లల బాధ్యతలను విస్మరించారని ఆర్తి ఆరోపిస్తే, ఆర్తి తనను ఇంటి నుంచి గెంటేసి, పిల్లలతో కలవనీయకుండా చేశారని రవి ఆరోపించారు.
Also Read:Keeravani : పవన్ కళ్యాణ్ కార్చిచ్చు…ఎంత వాన పడినా ఆగేది లేదు!
మే 21, 2025న చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో జరిగిన విచారణలో ఆర్తి నెలవారీ భరణంగా రూ. 40 లక్షలు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ డిమాండ్‌ను ఎద్దేవా చేస్తూ రవి మోహన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఫోన్‌లో మాట్లాడుతున్న ఫోటోతో “సమాచారం వచ్చింది” అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ను ఆర్తి డిమాండ్‌కు స్పందనగా భావిస్తూ నెటిజన్లు, అభిమానులు దీన్ని ఎగతాళిగా చూస్తున్నారు. ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో, రవి-ఆర్తి వివాదం మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచింది. రవి మోహన్, ఆర్తి మధ్య విడాకుల వివాదం సినీ పరిశ్రమలోనే కాక, సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారింది.