‘హరి హర వీరమల్లు’ సినిమా గీతావిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ, “ఈ సినిమాతో నా ప్రయాణం ఐదేళ్ల క్రితం క్రిష్తో మొదలై, ఇప్పుడు జ్యోతికృష్ణతో సఫలమైంది. నేను ఎందరో దర్శకులతో పనిచేశాను, కానీ జ్యోతికృష్ణలో అరుదైన లక్షణం కనిపించింది. వేగంగా నిర్ణయాలు తీసుకుని, వాటికి కట్టుబడి, ఎడిటింగ్, గ్రాఫిక్స్, సంగీతం అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తూ, నిద్రాహారాలు మాని ఈ చిత్రం కోసం అమితంగా శ్రమించాడు.
Also Read: Yash Mother : యశ్ తో మూవీ చేయను.. వాడికి ఆ విలువ తెలియదు..
ఇండస్ట్రీలో వివాదరహితుడిగా పేరుగాంచిన ఎ.ఎం. రత్నం గారి లిరిక్ రైటింగ్‌కు నేను పెద్ద అభిమానిని. ఈ సినిమా ఆయనకు మరో భారీ విజయాన్ని అందిస్తుందని నమ్ముతున్నాను. నిర్మాత దయాకర్ గారంటే నాకు అపార గౌరవం. ఈ ప్రాజెక్ట్‌లో ఆయన పాత్ర కీలకం. జ్యోతికృష్ణ ద్వారా రాంబాబు లాంటి అద్భుత గీత రచయితను పరిచయం చేశారు. నిధి అగర్వాల్ తన పాత్రను అద్భుతంగా పోషించింది.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొత్త కార్యక్రమం.. ప్రజా సమస్యలకు అక్కడే పరిష్కారం!
పవన్ కళ్యాణ్ గారిని మీరు పవర్ స్టార్ అంటారు, నేను మాత్రం ధర్మాగ్రహంగా చూస్తాను. సమాజం కోసం ఆయనలో ఉండే ఆ ఆగ్రహం అరుదైనది. ‘హరి హర వీరమల్లు’ సినిమాను ఆయనకు సరిపడేలా అద్భుతంగా తీర్చిదిద్దారు. జయాపజయాలతో సంబంధం లేకుండా కార్చిచ్చులా దూసుకుపోయే పవన్ గారితో నా తొలి సినిమా కావడంతో ఎంతో శ్రద్ధతో పనిచేశాను. జూన్ 12న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని మీరంతా ఆదరిస్తారని ఆశిస్తున్నాను,” అని హృదయస్పర్శిగా చెప్పారు.