జాతిరత్నాలు సినిమాతో వెండితెరకు పరిచయమైన హీరోయిన ఫరియా అబ్దుల్లా. ఆపాత్రలో చిట్టి అంటూ అందరిని తన క్యూట్ నెస్ తో యువత అభిమానాన్ని సంపాదించింది. అయితే.. తనకున్న హైట్.. లుక్ తో చిట్టికి పెద్ద అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ.. ఆ అంచనా తారుమారైంది. అయితే ఎక్కడ పొరపాటు జరిగిందో ఏమో తెలియదు కానీ.. తనలోని టాలెంటును ఓ వీడియో రూపంలో ఫరియా బెల్లీ డ్యాన్స్ చేసింది.
read also: YSRCP Plenary : భారీగా ట్రాఫిక్ .. కాలినడకన ప్లీనరీకి
తనలోని నాభి అందాలను చూపిస్తూ.. నడుమును షేక్ చేస్తూ.. చేసిన డాన్సును తన సోషల్ మీడియాలో పోస్టే చేసింది అమ్మడు. అయితే.. వీడియోను చూసిన నెటిజెనులకు మతి పోతోంది. ఫరియా లోని డ్యాన్సర్, గ్లామర్ లను చూపించడానికి చేస్తుందా అనేరీతిలో చిట్టి చేసిన ఫెర్ ఫార్మన్స్ తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పెద్ద డైరెక్టర్లు.. హీరోల కంట పడితే తాను స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయమంటూ ఈ అమ్మడు భావస్తోంది. మరి ఈ వీడియోపై ఏ డైరెక్టర్, ఏ హీరో కళ్లు పడనున్నాయో. చూసినా ఛాన్సులు వస్తాయా అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.