Janhvi Kapoor: ఆ సర్జరీ చేయించుకునే వరకు అమ్మ నేను హీరోయిన్గా పనికిరానంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ కిడ్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనంగా మారాయి.. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ, తాను హీరోయిన్ అవ్వడం తల్లికి ఏమాత్రం ఇష్టం లేదన్న షాకింగ్ నిజాన్ని జాన్వీ తాజాగా బయటపెట్టింది. ముఖ్యంగా తన ముక్కుకు సర్జరీ (రైనోప్లాస్టీ) జరిగిన తర్వాతే తనపై శ్రీదేవికి నమ్మకం కుదిరిందని జాన్వీ పేర్కొంది. ఇటీవల ‘గలాట్టా ప్లస్’ తమిళ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. జాన్వీకి కజిన్ అయిన నటి మహేశ్వరి ఈ ఇంటర్వ్యూకి హోస్ట్‌గా వ్యవహరించారు. తాను హీరోయిన్ అవుతానని మొదట చెప్పినప్పుడు శ్రీదేవి తీవ్రంగా వ్యతిరేకించారని జాన్వీ గుర్తుచేసుకుంది. “సినిమాల్లోకి వస్తే నీ జీవితం మొత్తాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది” అని శ్రీదేవి తనను హెచ్చరించినట్లు తెలిపింది. ఇదే విషయంపై మహేశ్వరి స్పందిస్తూ.. “జాను సినిమాల్లో నటించాలనుకుంటోంది కానీ, నాకెందుకో నమ్మకం లేదు. ఆ రంగానికి ఎంతో అంకితభావం, కఠిన శ్రమ, మానసిక దృఢత్వం కావాలి అని శ్రీదేవి నాతో కూడా చెప్పారు” అంటూ గతాన్ని గుర్తుచేసుకున్నారు.
ఈ సంభాషణ మధ్యలోనే జాన్వీ కల్పించుకుంటూ తన ముక్కు సర్జరీ గురించి బాంబ్ పేల్చింది. “బహుశా ఈ ఇంటర్వ్యూలో ఈ భాగాన్ని కట్ చేస్తారేమో. కానీ నిజం ఏంటంటే.. నా ముక్కు సర్జరీ జరగక ముందు వరకు నాలో హీరోయిన్ అయ్యే సత్తా ఉందని మా అమ్మ ఏమాత్రం నమ్మలేదు. ఆ సర్జరీ జరిగిన తర్వాతే నా లుక్స్ పట్ల, నా పొటెన్షియల్ పట్ల ఆమెకు నమ్మకం కుదిరింది. ఆ తర్వాతే నేను సినిమాల్లోకి రావడానికి ఆమె అంగీకరించారు” అంటూ జాన్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కూతురు జాన్వీని వెండితెరపై హీరోయిన్ గా చూడాలని ఎంతో ఆశపడిన శ్రీదేవి, జాన్వీ తొలి సినిమా ‘ధడక్’ విడుదల కాకముందే 2018లో దుబాయ్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వెళ్లి, అక్కడి హోటల్ బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు మునిగి 54 ఏళ్ల వయసులో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Also Read
- Scene : 3 రోజుల్లో 145 కోట్లు..సూర్య అరాచకం: 'సీన్' మూవీపై మహేష్ బాబు రివ్యూ!
- Dheeraj Mogilineni : బుక్ మై షో ట్రెండింగ్ వెనుక పెద్ద స్కామ్?..'ఫేక్' టికెట్ల బాగోతాన్ని బట్టబయలు చేసిన తెలుగు నిర్మాత
- Ranabali OTT Release Date: ఇక మీ ఇంట్లోకి రాబోతున్న 'రణబాలి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- NTR Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి సాలిడ్ అప్డేట్.. పూనకాలు తెప్పించేలా ‘డ్రాగన్’ క్లైమాక్స్ ఫైట్!
తాజావార్తలు
-
Janhvi Kapoor: ఆ సర్జరీ చేయించుకునే వరకు అమ్మ నేను హీరోయిన్గా పనికిరానంది!
-
Telangana Rice Prices : బియ్యం ధరలకు బ్రేక్.. కిలోకు గరిష్ట ధరలు ఫిక్స్.!
-
Potato Snacks: బండి మీద కంటే టేస్టీగా.. ఇంట్లోనే క్రిస్పీ ఆలూ పకోడీలు! తింటే వదిలిపెట్టరు..
-
Telangana Egg Donation Scam : రూ.30 వేల ఆశ చూపించి.. 50 మంది యువతుల జీవితాలతో ఆటలు
-
YS Jagan: రిగ్గింగ్ మాస్టర్ చంద్రబాబు..! ప్రజాస్వామ్యం గురించి నీతులా? జగన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!