Telangana Rice Prices : బియ్యం ధరలకు బ్రేక్.. కిలోకు గరిష్ట ధరలు ఫిక్స్.!
- బియ్యం రకాలను బట్టి గరిష్ట ధరలు ఖరారు
- కిలోకు రూ.66 నుంచి రూ.79 వరకు పరిమితి
- నకిలీ స్టిక్కర్లతో అమ్మితే కఠిన చర్యలు
- అక్రమ నిల్వలపై పీడీ యాక్ట్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో ఎగిసిపడుతున్న బియ్యం ధరల మంటపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది. మార్కెట్లో బియ్యం కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని పౌరసరఫరాల శాఖ తీవ్రంగా ఖండించింది. కృత్రిమ కొరత సృష్టించి సామాన్యుల జేబులకు చిల్లులు పొడుస్తున్న వ్యాపారుల ఆటకట్టించేందుకు నేరుగా రంగంలోకి దిగింది. వివిధ రకాల బియ్యం విక్రయాలపై గరిష్ట ధరల పరిమితిని (Maximum Retail Price) నిర్ణయిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
రకాలను బట్టి గరిష్ట ధరలు ఇవే
ప్రజలపై అదనపు భారం పడకుండా ఉండేందుకు రకాలను బట్టి కిలో బియ్యం గరిష్ట ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది. బీపీటీ (BPT), కేఎన్ఎమ్ (KNM) రకం బియ్యం కిలో గరిష్ట ధర రూ.66 గా నిర్ణయించింది. అలాగే ఎంతో ఆదరణ ఉన్న ఆర్ఎన్ఆర్ (RNR), తెలంగాణ సోనా రకం బియ్యం కిలో రూ.74కు మించకూడదని స్పష్టం చేసింది. ఇక హెచ్ఎమ్టీ (HMT), జేఎస్ఆర్ (JSR) రకం బియ్యం కిలో గరిష్ట ధర రూ.79గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయించిన ఎంఆర్పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పింది.
Also Read
- Telangana Egg Donation Scam : రూ.30 వేల ఆశ చూపించి.. 50 మంది యువతుల జీవితాలతో ఆటలు
- PRASHAST : ప్రైవేట్ స్కూళ్లలో కొత్త స్క్రీనింగ్.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు.!
- Siddipet Fake Death Certificate Scam: బతికున్నోళ్లను చంపేశారు.. 22 నకిలీ డెత్ సర్టిఫికెట్లతో స్కామ్
- Damodar Raja Narasimha : హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. జిల్లాల్లోనే కార్పొరేట్ వైద్యం..
నకిలీ స్టిక్కర్లు, మోసాలపై నిఘా.. పీడీ యాక్ట్ హెచ్చరిక
అక్రమ సంపాదన కోసం వ్యాపారులు చేస్తున్న కొత్త రకం మోసాలపై పౌరసరఫరాల శాఖ ఆరా తీసింది. 25 కిలోల బియ్యం బస్తాపై 26 కిలోల స్టిక్కర్ వేసి విక్రయిస్తున్న అక్రమార్కులపై ప్రత్యేక దృష్టి సారించింది. అంతేకాకుండా, అసలు ఎంఆర్పీ ధరలపై ఎక్కువ రేట్లు ఉన్న నకిలీ స్టిక్కర్లను అతికించి అమ్ముతున్న వారిపై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేసింది. బియ్యం అక్రమ నిల్వలు ఉంచినా, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడినా ఉపేక్షించేది లేదని.. పదేపదే నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై ఏకంగా పీడీ యాక్ట్ (PD Act) ప్రయోగిస్తామని ప్రభుత్వం ఘాటుగా హెచ్చరించింది.
నేరుగా మిల్లర్ల నుంచే సరుకు.. ఫీల్డ్ తనిఖీలు ముమ్మరం
రిటైల్ వ్యాపారులకు బియ్యం అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. ఇకపై రిటైలర్లు హోల్‌సేల్ వ్యాపారులపై ఆధారపడకుండా నేరుగా రైస్ మిల్లర్ల నుంచే బియ్యం సరఫరా పొందేలా ఏర్పాటు చేసింది. ఒకవేళ ఎక్కడైనా స్టాక్ సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత జిల్లా పౌరసరఫరాల అధికారికి (DSO) ఇండెంట్ ఇవ్వాలని సూచించింది. ధరల నియంత్రణ నిబంధనలు క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలవుతున్నాయో లేదో తేల్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో ఫీల్డ్ తనిఖీలను వేగవంతం చేసింది.
తాజావార్తలు
-
Telangana Rice Prices : బియ్యం ధరలకు బ్రేక్.. కిలోకు గరిష్ట ధరలు ఫిక్స్.!
-
Potato Snacks: బండి మీద కంటే టేస్టీగా.. ఇంట్లోనే క్రిస్పీ ఆలూ పకోడీలు! తింటే వదిలిపెట్టరు..
-
Telangana Egg Donation Scam : రూ.30 వేల ఆశ చూపించి.. 50 మంది యువతుల జీవితాలతో ఆటలు
-
YS Jagan: రిగ్గింగ్ మాస్టర్ చంద్రబాబు..! ప్రజాస్వామ్యం గురించి నీతులా? జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Who Is Alice Huang: ఎవరీ ఆలిస్ హువాంగ్? ఎన్విడియా బాస్‌నే బుట్టలో వేసుకున్న చైనా మిస్టరీ ఉమెన్!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!