ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చలనచిత్ర ఉత్సవాల్లో ‘కేన్స్ ఫిలిం ఫెస్టివల్’ ఒకటి. గత వారం అట్టహాసంగా ప్రారంభమైన ఈ ఫెస్టివల్‌కి ప్రపంచంలో ఉన్న ఫేమస్ నటీనటులు అందరు హాజరై సందడి చేస్తూ ఉండగా. హాలీవుడ్ నటీమణులు ఇప్పటికే కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కి హాజరై రెడ్ కార్పెట్‌పై సందడి చేయగా. ఇందులో భాగంగా తోలిసారిగా జాన్వీ కపూర్ హజరై ప్రపంచాన్నంతా తనవైపుకి తిప్పుకుంది. ఆమె కారు దిగడం ఆలస్యం వేల కొద్ది కెమెరాలు ఆమె చుట్టూ ముట్టాయి.
Also Read: Nidhhi Agerwal : నిధి అగర్వాల్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..
దీంతో ప్రస్తుతం జాన్వీ కపూర్ క్యూట్ లుక్స్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు జాన్వీ కపూర్ కూడా తన ఇన్‌స్టాలో కేన్స్ లుక్‌కి సంబంధించిన ఫొటో షూట్ చేసి ఆ పిక్స్ షేర్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా మరో నాలుగు రోజులు అంటే మే 24 వరకు ఈ కేన్స్ ఉత్సవం జరగనుంది. ఎంతో మంది అందాల భామలు కేన్స్‌లో సందడి చేయనున్నారు. ఇక జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి ‘పెద్ది’ అనే సినిమా చేస్తుంది. తెలుగులో తొలిసారి చేసిన ‘దేవర’ మంచి విజయం సాధించగా, ఇప్పుడు ‘పెద్ది’ కూడా హిట్ అయితే అమ్మడుకి ఆఫర్ల క్యూ కట్టడం ఖాయం.